Piluvave imkabainam briyumdidamde neegu

పిలువవే ఇఁకపైనఁ బ్రియుఁడితఁడే నీకు
Language

(॥పల్లవి॥)
పిలువవే ఇఁకపైనఁ బ్రియుఁడితఁడే నీకు
పొలుపునఁ బాయరాని పొందెంచవలదా

(॥పిలు॥)
అతిమోహములవారు అలుగఁగఁ జెల్లునా
ఇతవుగ వేఁడుకొనే దింపౌఁగాక
ఇతర కాంతలకుఁగా నితని నేల కోపించ
పతి కిచ్చకములాడేపాడి యెంచవలదా

(॥పిలు॥)
చేతికి లోనైనవారు సిగ్గువడఁదగునా
కాతరానఁ బైకొంటే కందువగాక
దూతిక పొందులకుఁగా దూరనేల రమణుని
నీతైనమొగనిసేవ నీవెంచవలదా

(॥పిలు॥)
సేసవెట్టినవారికి చిడుముడి పొసఁగునా
వేసరని కూటములే వేడుకగాక
శ్రీసతిని గూడితిని శ్రీవేంకటేశ్వరుని
ఆస నిన్నేలినవానినట్టె మెచ్చవలదా

(||pallavi||)
piluvave im̐kabainam̐ briyum̐ḍidam̐ḍe nīgu
pŏlubunam̐ bāyarāni pŏṁdĕṁchavaladā

(||pilu||)
adimohamulavāru alugam̐gam̐ jĕllunā
idavuga vem̐ḍugŏne diṁpaum̐gāga
idara kāṁtalagum̐gā nidani nela kobiṁcha
padi kichchagamulāḍebāḍi yĕṁchavaladā

(||pilu||)
sedigi lonainavāru sigguvaḍam̐dagunā
kādarānam̐ baigŏṁṭe kaṁduvagāga
dūdiga pŏṁdulagum̐gā dūranela ramaṇuni
nīdainamŏganiseva nīvĕṁchavaladā

(||pilu||)
sesavĕṭṭinavārigi siḍumuḍi pŏsam̐gunā
vesarani kūḍamule veḍugagāga
śhrīsadini gūḍidini śhrīveṁkaḍeśhvaruni
āsa ninnelinavāninaṭṭĕ mĕchchavaladā