పిలువరే వానిఁ బ్రియము చెప్పైన
(॥పల్లవి॥)
పిలువరే వానిఁ బ్రియము చెప్పైన
పొలసి తానేల పొయ్యీనే
(॥పిలు॥)
తళుకునఁ జూచి తలవంచుకొంటి
అలసి యేమైన నంటినటే
చెలువుఁడు తానే సిగ్గువడీ నింతే
యెలమి మాయింటికి యేల రాఁడే
(॥పిలు॥)
ఆడికలు వింటి నట్టె మఱచితి
తోడుత నేమైన దూరితినా
వేడుకకాఁడై విచారించీ నంతే
వోడి వాకిట నేలున్నాఁడే
(॥పిలు॥)
కపటాలు దీరె కాఁగిలించుకొంటి
చపలపుఁదప్పు సాదింతునా
యిపుడె శ్రీ వేంకటేశుఁడు గూడెను
వుపమలయాన లొద్దేలే
(||pallavi||)
piluvare vānim̐ briyamu sĕppaina
pŏlasi tānela pŏyyīne
(||pilu||)
taḽugunam̐ jūsi talavaṁchugŏṁṭi
alasi yemaina naṁṭinaḍe
sĕluvum̐ḍu tāne sigguvaḍī niṁte
yĕlami māyiṁṭigi yela rām̐ḍe
(||pilu||)
āḍigalu viṁṭi naṭṭĕ maṟasidi
toḍuda nemaina dūridinā
veḍugagām̐ḍai visāriṁchī naṁte
voḍi vāgiḍa nelunnām̐ḍe
(||pilu||)
kabaḍālu dīrĕ kām̐giliṁchugŏṁṭi
sabalabum̐dappu sādiṁtunā
yibuḍĕ śhrī veṁkaḍeśhum̐ḍu gūḍĕnu
vubamalayāna lŏddele