పిలువరే రమణునిఁ బ్రియము తోడ
(॥పల్లవి॥)
పిలువరే రమణునిఁ బ్రియము తోడ
నెలఁతవు యీ తగవు నీ వెఱఁగవా
(॥పిలు॥)
మనసు రంజిల్లఁ జేసి మగనిఁ బైకొంట కాక
చనవు గలిగితేను సాదింతురా
ననుపు చేసుకొని నవ్వుటే నేరుపుకాక
కినిసి వెంగెములాడి కెరలింతురా
(॥పిలు॥)
చల్లని మాటలాడి జట్టిగొనవలెఁగాక
చెల్లుబడిగలదంటా చెనకుదురా
మెల్లనే సేవచేసి మెప్పించవలెఁగాక
పల్లదాన నేరాలెంచి పంగింతురా
(॥పిలు॥)
కందువలఁ జేఇ చాఁచి కాఁగిలించవలెఁగాక
మందె మేళమాయనంటా మారుకొందురా
యిందునె శ్రీ వేంకటేశుఁ డీతఁ డిట్టె నిన్నుఁ గూడె
అందపు మోవిపై కెంపు లలరింతురా
(||pallavi||)
piluvare ramaṇunim̐ briyamu toḍa
nĕlam̐tavu yī tagavu nī vĕṟam̐gavā
(||pilu||)
manasu raṁjillam̐ jesi maganim̐ baigŏṁṭa kāga
sanavu galigidenu sādiṁturā
nanubu sesugŏni navvuḍe nerubugāga
kinisi vĕṁgĕmulāḍi kĕraliṁturā
(||pilu||)
sallani māḍalāḍi jaṭṭigŏnavalĕm̐gāga
sĕllubaḍigaladaṁṭā sĕnagudurā
mĕllane sevasesi mĕppiṁchavalĕm̐gāga
palladāna nerālĕṁchi paṁgiṁturā
(||pilu||)
kaṁduvalam̐ jei sām̐si kām̐giliṁchavalĕm̐gāga
maṁdĕ meḽamāyanaṁṭā mārugŏṁdurā
yiṁdunĕ śhrī veṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ ninnum̐ gūḍĕ
aṁdabu movibai kĕṁpu lalariṁturā