పిలువరే నాయకుని ప్రియములన్నియుఁ జెప్పి
(॥పల్లవి॥)
పిలువరే నాయకుని ప్రియములన్నియుఁ జెప్పి
తలఁవులో వేడుకలు దైవారుఁ గాని
(॥పిలు॥)
తనివోనిమోహములో తరవాయఁ జెలియకు
వినుకలి కథలెల్ల విరులాయను
గొనకొన్న కోరికలు కొమరాఁకలాయ నవె
యెనలేనివెడజాగు లిఁక నేఁటికే
(॥పిలు॥)
పొదిగి యెడమాటలే పోదులై పనిగొనియ
యెదురుచూపులయాస లెదురు దొట్టె
ముదురుఁ దమకమెల్ల ముప్పిరిఁ బెనగొనియె
పొదిగొన్నవట్టి తలపోఁత లిఁక నీలే
(॥పిలు॥)
తగులైన మచ్చికలు తరితీపులెసగించె
మొగమోట తాలిమిలు మొలపించెను
సొగసి శ్రీ వేంకటేశుఁడు తానె సతినేలె
నిగిడి దిన కొత్తలు నెరపనేమిటికే
(||pallavi||)
piluvare nāyaguni priyamulanniyum̐ jĕppi
talam̐vulo veḍugalu daivārum̐ gāni
(||pilu||)
tanivonimohamulo taravāyam̐ jĕliyagu
vinugali kathalĕlla virulāyanu
gŏnagŏnna korigalu kŏmarām̐kalāya navĕ
yĕnalenivĕḍajāgu lim̐ka nem̐ṭige
(||pilu||)
pŏdigi yĕḍamāḍale podulai panigŏniya
yĕdurusūbulayāsa lĕduru dŏṭṭĕ
mudurum̐ damagamĕlla muppirim̐ bĕnagŏniyĕ
pŏdigŏnnavaṭṭi talabom̐ta lim̐ka nīle
(||pilu||)
tagulaina machchigalu taridībulĕsagiṁchĕ
mŏgamoḍa tālimilu mŏlabiṁchĕnu
sŏgasi śhrī veṁkaḍeśhum̐ḍu tānĕ sadinelĕ
nigiḍi dina kŏttalu nĕrabanemiḍige