Piluvare krshnuni perugoni yimtadaanu

పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
Language

(॥పల్లవి॥)
పిలువరే కృష్ణుని పేరుకొని యింతటాను
పొలసి యారగించే పొద్దాయ నిపుడు

(॥పిలు॥)
వెన్నలారగించఁబోయి వీదులలోఁ దిరిగీనో
యెన్నరాని యమునలో యీఁదులాడీనో
సన్నల సాందీపనితో చవఁగబోయినాఁడో
చిన్నవాఁడాకలి గొనె చెలులాల యిపుడు

(॥పిలు॥)
మగువల కాఁగిళ్ల మఱచి నిద్దిరించీనో
సొగిసి యావులఁ గాచే చోట నున్నాఁడో
యెగువ నుట్లకెక్కి యింతులకుఁ జిక్కినాఁడో
సగము వేఁడికూరలు చల్లనాయ నిపుడు

(॥పిలు॥)
చెంది నెమలి చుంగుల సింగారుంకొనీనో
ఇందునే దేవరవలె ఇంటనున్నాఁడో
అందుపు శ్రీవేంకటేశుఁ డాడివచ్చె నిదె వీఁడె
విందుల మాపొత్తుకు రా వేళాయ నిపుడు

(||pallavi||)
piluvare kṛṣhṇuni perugŏni yiṁtaḍānu
pŏlasi yāragiṁche pŏddāya nibuḍu

(||pilu||)
vĕnnalāragiṁcham̐boyi vīdulalom̐ dirigīno
yĕnnarāni yamunalo yīm̐dulāḍīno
sannala sāṁdībanido savam̐gaboyinām̐ḍo
sinnavām̐ḍāgali gŏnĕ sĕlulāla yibuḍu

(||pilu||)
maguvala kām̐giḽla maṟasi niddiriṁchīno
sŏgisi yāvulam̐ gāse soḍa nunnām̐ḍo
yĕguva nuṭlagĕkki yiṁtulagum̐ jikkinām̐ḍo
sagamu vem̐ḍigūralu sallanāya nibuḍu

(||pilu||)
sĕṁdi nĕmali suṁgula siṁgāruṁkŏnīno
iṁdune devaravalĕ iṁṭanunnām̐ḍo
aṁdubu śhrīveṁkaḍeśhum̐ ḍāḍivachchĕ nidĕ vīm̐ḍĕ
viṁdula mābŏttugu rā veḽāya nibuḍu