Pilisina neṟamgavu premabum baraaguna

పిలిచిన నెఱఁగవు ప్రేమపుఁ బరాకున
Language

(॥పల్లవి॥)
పిలిచిన నెఱఁగవు ప్రేమపుఁ బరాకున
చెలరేఁగి ఆడేవు చెల్లునయ్య ఇఁకను

(॥పిలి॥)
చొక్కపుఇంతిగుబ్బలే జూజపుసారెలు నీకు
నిక్కినమంచివురమే నెత్తవలక
అక్కడిగోరిరేకలే ఆమర వ్రాసినయిండ్లు
చిక్కించు కాటలాడేవు చెల్లునయ్య యిఁకను

(॥పిలి॥)
మదనమందిరమే మచ్చికపులిజూజము
వుదుటుమొగపు వజ్రా లొడ్డినరాళ్లు
మొదలైన రతులెల్ల మూలదాంట్లు నీకు
చెదరని ఆటాడేవు చెల్లునయ్య యిఁకను

(॥పిలి॥)
పొలసి ముట్టి ముట్టాడేపోఁకముడి గుంతపోఁక
కొలఁదైననాభే యిక్కువైన గుంత
వెలయ శ్రీ వేంకటేశ వెసఁ గూడి సారెసారె
చెలరేఁగి ఆడేవు చెల్లునయ్య యిఁకను

(||pallavi||)
pilisina nĕṟam̐gavu premabum̐ barāguna
sĕlarem̐gi āḍevu sĕllunayya im̐kanu

(||pili||)
sŏkkabuiṁtigubbale jūjabusārĕlu nīgu
nikkinamaṁchivurame nĕttavalaga
akkaḍigoriregale āmara vrāsinayiṁḍlu
sikkiṁchu kāḍalāḍevu sĕllunayya yim̐kanu

(||pili||)
madanamaṁdirame machchigabulijūjamu
vuduḍumŏgabu vajrā lŏḍḍinarāḽlu
mŏdalaina radulĕlla mūladāṁṭlu nīgu
sĕdarani āḍāḍevu sĕllunayya yim̐kanu

(||pili||)
pŏlasi muṭṭi muṭṭāḍebom̐kamuḍi guṁtabom̐ka
kŏlam̐dainanābhe yikkuvaina guṁta
vĕlaya śhrī veṁkaḍeśha vĕsam̐ gūḍi sārĕsārĕ
sĕlarem̐gi āḍevu sĕllunayya yim̐kanu