పిలిచి చేకొనవయ్యా ప్రియురాలిని
(॥పల్లవి॥)
పిలిచి చేకొనవయ్యా ప్రియురాలిని
సులభాన వచ్చె మేలు జోలి ఇంతవలెనా
(॥పిలి॥)
సొలసి సొలసి చూచి చొరువల కిటు లాచి
యెలయించీ నిన్ను నీకె యెవ్వతోకాని
యెలమి నీవేళనే యెక్కడ పరాకు నీకు
వలపు తనంతరాఁగా వద్దనఁగవచ్చునా
(॥పిలి॥)
వచ్చి వచ్చి మాటలాడి వన్నెలుగాఁ బాటవాడి
ఇచ్చీ నీకు విడెము యెవ్వతోకాని
పచ్చిగా నీకీవేళ పనులెల్లాఁ గలిగెనా
మచ్చికచుట్టరికము మఱవఁగఁదగునా
(॥పిలి॥)
వినయములెల్లాఁ జేసీ వేడుక చన్నులరాసి
యెనసె నిన్నిప్పుడే యెవ్వతోకాని
నిను శ్రీవేంకటేశుఁడ నే నలమేలుమంగను
చెనకి దక్కఁగఁగొంటి సిగ్గు నెరపుదురా
(||pallavi||)
pilisi segŏnavayyā priyurālini
sulabhāna vachchĕ melu joli iṁtavalĕnā
(||pili||)
sŏlasi sŏlasi sūsi sŏruvala kiḍu lāsi
yĕlayiṁchī ninnu nīgĕ yĕvvadogāni
yĕlami nīveḽane yĕkkaḍa parāgu nīgu
valabu tanaṁtarām̐gā vaddanam̐gavachchunā
(||pili||)
vachchi vachchi māḍalāḍi vannĕlugām̐ bāḍavāḍi
ichchī nīgu viḍĕmu yĕvvadogāni
pachchigā nīgīveḽa panulĕllām̐ galigĕnā
machchigasuṭṭarigamu maṟavam̐gam̐dagunā
(||pili||)
vinayamulĕllām̐ jesī veḍuga sannularāsi
yĕnasĕ ninnippuḍe yĕvvadogāni
ninu śhrīveṁkaḍeśhum̐ḍa ne nalamelumaṁganu
sĕnagi dakkam̐gam̐gŏṁṭi siggu nĕrabudurā