పెనఁగుతా నాన లేల పెట్టించుకొనేవే నీవు
(॥పల్లవి॥)
పెనఁగుతా నాన లేల పెట్టించుకొనేవే నీవు
మనసు వచ్చిన మీఁద మరచీనా ఇఁకను
(॥పెనఁ॥)
చక్కరానవు నీవు చదురులాడ నేర్తువు
యిక్కడఁ బతి మోహించు టేమి సోద్యమే
జక్కవ గుబ్బలు మోపి సరసము లాడితివి
మక్కువ నిన్నాతఁడు మరచీనా ఇఁకను
(॥పెనఁ॥)
నెఱజాణ విన్నిటాను నీ గుణము కోటిసేసు
మెఱసి నీ బిన్నాణాలు మెచ్చవద్దటే
చిఱునవ్వు వెదచల్లి చిత్తము గరఁచితివి
మఱి యీతఁడు నీ పొందు మఱచీనీ యిఁకను
(॥పెనఁ॥)
పాయపుదానవు నీవు పంపు సేసుకోఁగలవు
చే యంటి ప్రియా లీతఁడు చెప్పఁజెల్లునే
యీయెడ శ్రీవేంకటేశుఁ డీతఁ డిట్టె నిన్ను నేలె
మాయింట దా నుంటే నిన్ను మరచీనా యిఁకను
(||pallavi||)
pĕnam̐gudā nāna lela pĕṭṭiṁchugŏneve nīvu
manasu vachchina mīm̐da marasīnā im̐kanu
(||pĕnam̐||)
sakkarānavu nīvu sadurulāḍa nerduvu
yikkaḍam̐ badi mohiṁchu ṭemi sodyame
jakkava gubbalu mobi sarasamu lāḍidivi
makkuva ninnādam̐ḍu marasīnā im̐kanu
(||pĕnam̐||)
nĕṟajāṇa vinniḍānu nī guṇamu koḍisesu
mĕṟasi nī binnāṇālu mĕchchavaddaḍe
siṟunavvu vĕdasalli sittamu garam̐sidivi
maṟi yīdam̐ḍu nī pŏṁdu maṟasīnī yim̐kanu
(||pĕnam̐||)
pāyabudānavu nīvu paṁpu sesugom̐galavu
se yaṁṭi priyā līdam̐ḍu sĕppam̐jĕllune
yīyĕḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ ḍiṭṭĕ ninnu nelĕ
māyiṁṭa dā nuṁṭe ninnu marasīnā yim̐kanu