Pelaguridi sennum dide penamgee ne mokkagaanu

పేలకురితి చెన్నుఁ డిదె పెనఁగీ నే మొక్కగాను
Language

(॥పల్లవి॥)
పేలకురితి చెన్నుఁ డిదె పెనఁగీ నే మొక్కగాను
చేలకొంగు వట్టి నన్నుఁ జెక్కునొక్కీనే

(॥పేల॥)
వేవేలు సతులవాఁడు వేడుకకాఁ డితఁడు
నావంక చూచి యెంతనవ్వు నవ్వీనే
భావజగురుఁడు తాను పచ్చిమోవివాఁడు తాను
వావులెల్లాఁ జెప్పి యెంత వలపించేనే

(॥పేల॥)
అతిరాజసపువాఁడు అన్నిటా వినోదకాఁడు
కతలు చెప్పి నన్నెంత గారవించీనే
చతురుఁ డన్నిటాఁ దాను చక్కనివాఁడు తాను
మతిఁగరఁగ నెంతేసిమాఁట లాడీనే

(॥పేల॥)
నెరవాది కోడెకాఁడ నెయ్యపుఁ జేఁతలవాఁడు
గరిమ నన్నెంత సేసి కాఁగిలించీనే
అరిది శ్రీవేంకటాద్రియందు బేరకుర్తిలోన
తిరమై నన్నేలి యెంత తెలిపి మెచ్చీనే

(||pallavi||)
pelaguridi sĕnnum̐ ḍidĕ pĕnam̐gī ne mŏkkagānu
selagŏṁgu vaṭṭi nannum̐ jĕkkunŏkkīne

(||pela||)
vevelu sadulavām̐ḍu veḍugagām̐ ḍidam̐ḍu
nāvaṁka sūsi yĕṁtanavvu navvīne
bhāvajagurum̐ḍu tānu pachchimovivām̐ḍu tānu
vāvulĕllām̐ jĕppi yĕṁta valabiṁchene

(||pela||)
adirājasabuvām̐ḍu anniḍā vinodagām̐ḍu
kadalu sĕppi nannĕṁta gāraviṁchīne
sadurum̐ ḍanniḍām̐ dānu sakkanivām̐ḍu tānu
madim̐garam̐ga nĕṁtesimām̐ṭa lāḍīne

(||pela||)
nĕravādi koḍĕgām̐ḍa nĕyyabum̐ jem̐talavām̐ḍu
garima nannĕṁta sesi kām̐giliṁchīne
aridi śhrīveṁkaḍādriyaṁdu beragurdilona
tiramai nanneli yĕṁta tĕlibi mĕchchīne