Pekku sadulu galugu pemdligodugavu

పెక్కు సతులు గలుగు పెండ్లికొడుకవు
Language

(॥పల్లవి॥)
పెక్కు సతులు గలుగు పెండ్లికొడుకవు
దిక్కని నమ్మితి నిన్ను దేవరవు నీవు

(॥పెక్కు॥)
నవ్వులవలె నున్నవి నయాగారి నీమాఁటలు
పువ్వులవలె నున్నవి బూటకములు
జవ్వనపు దాన నేను సమ్మతింతు నెందుకైనా
యవ్వఁడెఱుఁగు నీగుణ మేమి సే సేవో

(॥పెక్కు॥)
మేడలపొడవులాయ మెచ్చేటి నీ ప్రియములు
గోడకంటె దట్టము నీగుట్టు చేఁతలు
నీడవంటిదాన నేను నీ చెప్పినట్టె సేతును
పాడిబంతమెఱఁగను భాగ్యము నీ చేతిది

(॥పెక్కు॥)
గుంపులు గుంపులు గట్టె కూడిన నీ భోగములు
దింపరాని మోపులు నీ తీగెమొక్కులు
ముంపుల శ్రీ వేంకటేశ ముంచి నే నిన్నుఁగూడితి
అంపలేను నే నిన్ను అడ్డమాడ కిఁకను

(||pallavi||)
pĕkku sadulu galugu pĕṁḍligŏḍugavu
dikkani nammidi ninnu devaravu nīvu

(||pĕkku||)
navvulavalĕ nunnavi nayāgāri nīmām̐ṭalu
puvvulavalĕ nunnavi būḍagamulu
javvanabu dāna nenu sammadiṁtu nĕṁdugainā
yavvam̐ḍĕṟum̐gu nīguṇa memi se sevo

(||pĕkku||)
meḍalabŏḍavulāya mĕchcheḍi nī priyamulu
goḍagaṁṭĕ daṭṭamu nīguṭṭu sem̐talu
nīḍavaṁṭidāna nenu nī sĕppinaṭṭĕ sedunu
pāḍibaṁtamĕṟam̐ganu bhāgyamu nī sedidi

(||pĕkku||)
guṁpulu guṁpulu gaṭṭĕ kūḍina nī bhogamulu
diṁparāni mobulu nī tīgĕmŏkkulu
muṁpula śhrī veṁkaḍeśha muṁchi ne ninnum̐gūḍidi
aṁpalenu ne ninnu aḍḍamāḍa kim̐kanu