పెద్దలు మీ రంతేసి పెనఁగనేల
(॥పల్లవి॥)
పెద్దలు మీ రంతేసి పెనఁగనేల
వుద్దండపు నీ చేఁతలు వుట్టిఁ బెట్టవయ్యా
(॥పెద్ద॥)
మోవిపండు గానుకిచ్చె మొక్కె నీకుఁ జేతులను
సేవ లింకానేమి యాపె సేసునయ్యా
కావిరించి దగ్గరితే కాలు దాఁకుఁ జేయి దాఁకు
దేవరవంటినీ కంతేసి తగదయ్యా
(॥పెద్ద॥)
గోరంటపూ వందిఇచ్చె కొలువున నిలుచుండె
పేరి యిచ్చకము లేమి పెంచునయ్యా
వేరెమాట లాడఁబోతే వెంగెమౌనో వెగటౌనో
ఆరీతి దొరవు నీ కవి చెల్లవయ్యా
(॥పెద్ద॥)
ఆరతిచ్చె నానాంగల నన్నిటికి సమ్మతించె
కూరిమి నిన్నెట్లాను కొసరునయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యింపు లేదో సొంపు లేదో
ఆరితేరినట్టినీకు ఆస మానదయ్యా
(||pallavi||)
pĕddalu mī raṁtesi pĕnam̐ganela
vuddaṁḍabu nī sem̐talu vuṭṭim̐ bĕṭṭavayyā
(||pĕdda||)
movibaṁḍu gānugichchĕ mŏkkĕ nīgum̐ jedulanu
seva liṁkānemi yābĕ sesunayyā
kāviriṁchi daggaride kālu dām̐kum̐ jeyi dām̐ku
devaravaṁṭinī kaṁtesi tagadayyā
(||pĕdda||)
goraṁṭabū vaṁdiichchĕ kŏluvuna nilusuṁḍĕ
peri yichchagamu lemi pĕṁchunayyā
verĕmāḍa lāḍam̐bode vĕṁgĕmauno vĕgaḍauno
ārīdi dŏravu nī kavi sĕllavayyā
(||pĕdda||)
āradichchĕ nānāṁgala nanniḍigi sammadiṁchĕ
kūrimi ninnĕṭlānu kŏsarunayyā
yīrīdi śhrīveṁkaḍeśha yiṁpu ledo sŏṁpu ledo
āriderinaṭṭinīgu āsa mānadayyā