పెదవుల రాగం..పెర పెర తాళం..
పల్లవి:
పెదవుల రాగం..పెర పెర తాళం..
పెదవుల రాగం..పెర పెర తాళం..
ఎందుకనీ..ఈ..ఈ....ఏ విందుకనీ..ఈ..ఈ
ఎందుకనీ..ఈ..ఈ....ఏ విందుకనీ..ఈ..ఈ
తనవుల రాగం..తహ తహ తాళం..
తనవుల రాగం..తహ తహ తాళం..
అందుకనీ..ఈ..ఈ...నీ పొందుకనీ..ఈ..ఈ
అందుకనీ..ఈ..ఈ...నీ పొందుకనీ..ఈ..ఈ
చరణం 1:
తుమ్మెద రెక్కల ముంగురులే..తుంటరి చిందులు వేస్తుంటే..
వెచ్చని చూపుల ఊపిరులే..వంటికి చిక్కులు పెడుతుంటే..
రేపూ..మాపూ..రెపరెపగా..
చూపు ..చూపు.. చురచురగా
మబ్బులు పట్టిన మనసులలో..
మసకలు కమ్మిన వయసులలో..
చినుకులు పడితే..వణుకులు పుడితే..
గొడుగులు పడితే..కలతలు పడితే..ఏ...
పెదవుల రాగం...తహ తహ తాళం
చరణం 2:
మల్లెల సిగలో మత్తులుగా..ఎల్లలులేవిక రమ్మంటే..
సిగ్గులు చీకటి గుర్తులుగా..మొగ్గలు తుంచుకు పొమ్మంటే..
చేయి..చేయి చెడుగుడుగా..
నువ్వు నేను వరసయితే..
కలిగిన తమకపు గమకములో..పెరిగిన తపనల సరిగమలో..
శృతి మొదలెడితే..లయలిక పుడితే..
జత ముడిపడితే...అలజడి పుడితే....
పెదవుల రాగం...తహ తహ తాళం
ఎందుకనీ..ఈ..ఈ....ఏ విందుకనీ..ఈ..ఈ
అందుకనీ..ఈ..ఈ...నీ పొందుకనీ..ఈ..ఈ
pallavi:
pĕdavula rāgaṁ..pĕra pĕra tāḽaṁ..
pĕdavula rāgaṁ..pĕra pĕra tāḽaṁ..
ĕṁduganī..ī..ī....e viṁduganī..ī..ī
ĕṁduganī..ī..ī....e viṁduganī..ī..ī
tanavula rāgaṁ..taha taha tāḽaṁ..
tanavula rāgaṁ..taha taha tāḽaṁ..
aṁduganī..ī..ī...nī pŏṁduganī..ī..ī
aṁduganī..ī..ī...nī pŏṁduganī..ī..ī
saraṇaṁ 1:
tummĕda rĕkkala muṁgurule..tuṁṭari siṁdulu vestuṁṭe..
vĕchchani sūbula ūbirule..vaṁṭigi sikkulu pĕḍuduṁṭe..
rebū..mābū..rĕbarĕbagā..
sūbu ..sūbu.. surasuragā
mabbulu paṭṭina manasulalo..
masagalu kammina vayasulalo..
sinugulu paḍide..vaṇugulu puḍide..
gŏḍugulu paḍide..kaladalu paḍide..e...
pĕdavula rāgaṁ...taha taha tāḽaṁ
saraṇaṁ 2:
mallĕla sigalo mattulugā..ĕllaluleviga rammaṁṭe..
siggulu sīgaḍi gurdulugā..mŏggalu tuṁchugu pŏmmaṁṭe..
seyi..seyi sĕḍuguḍugā..
nuvvu nenu varasayide..
kaligina tamagabu gamagamulo..pĕrigina tabanala sarigamalo..
śhṛti mŏdalĕḍide..layaliga puḍide..
jada muḍibaḍide...alajaḍi puḍide....
pĕdavula rāgaṁ...taha taha tāḽaṁ
ĕṁduganī..ī..ī....e viṁduganī..ī..ī
aṁduganī..ī..ī...nī pŏṁduganī..ī..ī