Pavvalimchu mibuditte paanubumeemda

పవ్వళించు మిపుడిట్టె పానుపుమీఁద
Language

(॥పల్లవి॥)
పవ్వళించు మిపుడిట్టె పానుపుమీఁద
దవ్వులనే యీవేళ తలవంచేవయ్యా

(॥పవ్వ॥)
రవ్వలాయ నామోహము రచ్చకెక్కె నీ తగవు
నవ్వినటులనే వుండి(డె?) నాకు నీకును
పువ్వువంటి జవ్వనము పూఁచరాదు దాఁచరాదు
చివ్వన నీవేఁటికి సిగ్గువడేవయ్యా

(॥పవ్వ॥)
మేర మీరె నావేడుక మెరసెను నీచలము
నారుకొనెఁ గోరికెలు నాకు నీకును
భారమైన తమకము పట్టరాదు ముట్టరాదు
దారకాన నీవేల తలపోసేవయ్యా

(॥పవ్వ॥)
కడు మించె నా కాగిలి కానవచ్చె నీగుణము
నడుమఁ బంతము దక్కె నాకు నీకును
యెడయక శ్రీ వేంకటేశ యేలితివి నన్ను
తడఁబడి నీవేల దప్పిదేరేవయ్యా

(||pallavi||)
pavvaḽiṁchu mibuḍiṭṭĕ pānubumīm̐da
davvulane yīveḽa talavaṁchevayyā

(||pavva||)
ravvalāya nāmohamu rachchagĕkkĕ nī tagavu
navvinaḍulane vuṁḍi(ḍĕ?) nāgu nīgunu
puvvuvaṁṭi javvanamu pūm̐sarādu dām̐sarādu
sivvana nīvem̐ṭigi sigguvaḍevayyā

(||pavva||)
mera mīrĕ nāveḍuga mĕrasĕnu nīsalamu
nārugŏnĕm̐ gorigĕlu nāgu nīgunu
bhāramaina tamagamu paṭṭarādu muṭṭarādu
dāragāna nīvela talabosevayyā

(||pavva||)
kaḍu miṁchĕ nā kāgili kānavachchĕ nīguṇamu
naḍumam̐ baṁtamu dakkĕ nāgu nīgunu
yĕḍayaga śhrī veṁkaḍeśha yelidivi nannu
taḍam̐baḍi nīvela dappiderevayyā