పట్టివిడిచిన మాట పడితాళించె నిదివో
(॥పల్లవి॥)
పట్టివిడిచిన మాట పడితాళించె నిదివో
యిట్టె నోరారుతువు నీ వెందరినైనా
(॥పట్టి॥)
చాలులేరా నేఁడె నాకు సరివచ్చె నామతికి
కాలమందే నమ్మినట్టి కల్ల గలదు
కోలగాచి పందెమాడి కోపగించఁ జాలఁగాక
వోలి నీవురాన సతి వున్న దది గాదా
(॥పట్టి॥)
కద్దు లేరా నావొళ్లి కల్లలే నీ వేమి సెతు
వొద్దఁ గాచుకుండకుంటే వూరకుందురా
చద్దికి వేఁడికి వాదు చవిగాదనుచుఁగాక
అద్దివో నీ వీఁపు మీఁద నంగన గాదా
(॥పట్టి॥)
తగులేరా నీకు నాకు తారుకాణించఁగ నేల
మొగమోట నున్నదే నా మోసము గాదా
నగుతా శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి నేఁడు
నిగిడి నీ శిరసుపై నేనే కాన
(||pallavi||)
paṭṭiviḍisina māḍa paḍidāḽiṁchĕ nidivo
yiṭṭĕ norāruduvu nī vĕṁdarinainā
(||paṭṭi||)
sālulerā nem̐ḍĕ nāgu sarivachchĕ nāmadigi
kālamaṁde namminaṭṭi kalla galadu
kolagāsi paṁdĕmāḍi kobagiṁcham̐ jālam̐gāga
voli nīvurāna sadi vunna dadi gādā
(||paṭṭi||)
kaddu lerā nāvŏḽli kallale nī vemi sĕdu
vŏddam̐ gāsuguṁḍaguṁṭe vūraguṁdurā
saddigi vem̐ḍigi vādu savigādanusum̐gāga
addivo nī vīm̐pu mīm̐da naṁgana gādā
(||paṭṭi||)
tagulerā nīgu nāgu tārugāṇiṁcham̐ga nela
mŏgamoḍa nunnade nā mosamu gādā
nagudā śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi nem̐ḍu
nigiḍi nī śhirasubai nene kāna