Pattinamte pamtamu balimigalavaarigi

పట్టినంతే పంతము బలిమిగలవారికి
Language

(॥పల్లవి॥)
పట్టినంతే పంతము బలిమిగలవారికి
చిట్టకాలు మానుమాను చెప్పనా నీకును

(॥పట్టి॥)
చాలునంటే మానరాదా సరసాలు మాతోడ
కాలుదొక్కినందులోనే కానవచ్చెను
వాలుక చూపులు గొంత వంచవలెనా ఇంకా
మేలు మేలనుచు దొల్లె మెచ్చనా నిన్నును

(॥పట్టి॥)
అడిగితేఁ జెప్పరాదా ఆయములైన కతలు
కడు లోలో నవ్వినందే కానపచ్చెను
వొడ లేమి నిమిరేవు వూరకైనా నప్పటిని
గడుసుఁ జన్నుల మతి కరఁగించనా

(॥పట్టి॥)
యియ్యకోలు సేయరాదా యిప్పటి నీ చేఁతలెల్ల
కయ్యము పెట్టనీయందే కానవచ్చెను
వియ్యపు శ్రీ వేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
వుయ్యాల మంచము మీఁద నొరయనా నేఁడు

(||pallavi||)
paṭṭinaṁte paṁtamu balimigalavārigi
siṭṭagālu mānumānu sĕppanā nīgunu

(||paṭṭi||)
sālunaṁṭe mānarādā sarasālu mādoḍa
kāludŏkkinaṁdulone kānavachchĕnu
vāluga sūbulu gŏṁta vaṁchavalĕnā iṁkā
melu melanusu dŏllĕ mĕchchanā ninnunu

(||paṭṭi||)
aḍigidem̐ jĕpparādā āyamulaina kadalu
kaḍu lolo navvinaṁde kānabachchĕnu
vŏḍa lemi nimirevu vūragainā nappaḍini
gaḍusum̐ jannula madi karam̐giṁchanā

(||paṭṭi||)
yiyyagolu seyarādā yippaḍi nī sem̐talĕlla
kayyamu pĕṭṭanīyaṁde kānavachchĕnu
viyyabu śhrī veṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
vuyyāla maṁchamu mīm̐da nŏrayanā nem̐ḍu