Pattaraanidi vayasu padamti nemanavachchu

పట్టరానిది వయసు పడఁతి నేమనవచ్చు
Language

(॥పల్లవి॥)
పట్టరానిది వయసు పడఁతి నేమనవచ్చు
చుట్టమగు పతిఁ దెచ్చి చూపరే సతికి

(॥పట్ట॥)
దుమ్ములెగయఁగ వలపు దూరుపెత్తీఁ జెలియ
నుమ్మగిలుచున్న నిట్టూరుపులను
చిమ్మిరేఁగుచునున్న సిగ్గులు నానఁగఁ బెట్టె
చెమ్మఁ జెమటల నేమి సేతమే ఇఁకను

(॥పట్ట॥)
వుడివోనితమకముల నుమురఁబెట్టీఁ జెలియ
పొడవు దమకముల తలపోఁతలోన
యెడనెడల జిరునవ్వు లెండఁబోసీ నదివొ
కడలేని విరహఁపుఁగాఁకలనుఁ జెలఁగి

(॥పట్ట॥)
గుదిగొన్న కోరికలఁ గూడపెట్టీఁ జెలియ
తుద నెదురుచూపుల కన్నుదోయి యందు
అదనెరింగి శ్రీవేంకటాధిపుఁడు గూడఁగా
సదమదపుకాఁగిటను సమరతులఁ బెనఁగె

(||pallavi||)
paṭṭarānidi vayasu paḍam̐ti nemanavachchu
suṭṭamagu padim̐ dĕchchi sūbare sadigi

(||paṭṭa||)
dummulĕgayam̐ga valabu dūrubĕttīm̐ jĕliya
nummagilusunna niṭṭūrubulanu
simmirem̐gusununna siggulu nānam̐gam̐ bĕṭṭĕ
sĕmmam̐ jĕmaḍala nemi sedame im̐kanu

(||paṭṭa||)
vuḍivonidamagamula numuram̐bĕṭṭīm̐ jĕliya
pŏḍavu damagamula talabom̐talona
yĕḍanĕḍala jirunavvu lĕṁḍam̐bosī nadivŏ
kaḍaleni viraham̐pum̐gām̐kalanum̐ jĕlam̐gi

(||paṭṭa||)
gudigŏnna korigalam̐ gūḍabĕṭṭīm̐ jĕliya
tuda nĕdurusūbula kannudoyi yaṁdu
adanĕriṁgi śhrīveṁkaḍādhibum̐ḍu gūḍam̐gā
sadamadabugām̐giḍanu samaradulam̐ bĕnam̐gĕ