Pattaraani vayasudo pachchiyai vunnaamdavu

పట్టరాని వయసుతో పచ్చియై వున్నాఁడవు
Language

(॥పల్లవి॥)
పట్టరాని వయసుతో పచ్చియై వున్నాఁడవు
నెట్టుకొన్న గుట్టు నీకు నేర్పదాయనా

(॥॥)
కందువ నీతో నిందాకాఁ గాఁపురము సేసినది
దిందుపడ నీగుణము దిద్దదాయనా
సందడి నందరిలోన చనవుగలిగినది
పొందుగా నాచారాలు బోదించదాయనా

(॥॥)
కఱఁగించి నిన్నునింత కడువలపంచినది
మఱి యితరచింతలు మాన్పదాయనా
మెఱయ నీతో నేపొద్దు మేలములే యాడేది
జఱసి నీతులు నిన్నుఁ జదివించదాయనా

(॥॥)
యెలమి నీకిన్నిటాను ఇచ్చకురాలై నది
యిల నన్ను నీవేలిన దెంచదాయనా
అలమేలగమంగపతివైన శ్రీవేంకటేశ్వర
కలసిన దిట్టె జలకము లార్చదాయనా

(||pallavi||)
paṭṭarāni vayasudo pachchiyai vunnām̐ḍavu
nĕṭṭugŏnna guṭṭu nīgu nerbadāyanā

(||||)
kaṁduva nīdo niṁdāgām̐ gām̐puramu sesinadi
diṁdubaḍa nīguṇamu diddadāyanā
saṁdaḍi naṁdarilona sanavugaliginadi
pŏṁdugā nāsārālu bodiṁchadāyanā

(||||)
kaṟam̐giṁchi ninnuniṁta kaḍuvalabaṁchinadi
maṟi yidarasiṁtalu mānpadāyanā
mĕṟaya nīdo nebŏddu melamule yāḍedi
jaṟasi nīdulu ninnum̐ jadiviṁchadāyanā

(||||)
yĕlami nīginniḍānu ichchagurālai nadi
yila nannu nīvelina dĕṁchadāyanā
alamelagamaṁgabadivaina śhrīveṁkaḍeśhvara
kalasina diṭṭĕ jalagamu lārsadāyanā