Pattaraani tamidoda baamti pade mimtegaaga

పట్టరాని తమితోడ బాఁతి పడే మింతేకాక
Language

(॥పల్లవి॥)
పట్టరాని తమితోడ బాఁతి పడే మింతేకాక
యెట్టు సేసినా నీకు యెరపు సతమయ్యీనా

(॥పట్ట॥)
వేసదారి మాఁటలాడి వేడుక నవ్వులు నవ్వి
ఆసల నెంత వెట్టేవే ఆతని నీవు
ఆ సుద్దులటు వెట్టవే యటువంటివాఁడుగాఁడు
నా సొమ్మయినవాఁడు నీ సన్నలకు లోనయ్యీనా

(॥పట్ట॥)
సొలసి సొలసి చూచి చొక్కులనల్లాఁబెట్టి
యలయించనేమిటికే యాతని నీవు
చలము లిఁక మానవే సమ్మతించఁ డాతఁడు
తొలుతే నన్నేలె నీ పొందులకుఁ జిక్కీనా

(॥పట్ట॥)
కప్పురము మోవిఁ జూపి కాఁగిటికి లాఁచి లాచి
అప్పటిఁ గొసరేవేవే యాతని నీవు
యిప్పుడు శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నన్ను నేలె
వొప్పగు నా రమణుఁడు వొద్దిక నీకయ్యీనా

(||pallavi||)
paṭṭarāni tamidoḍa bām̐ti paḍe miṁtegāga
yĕṭṭu sesinā nīgu yĕrabu sadamayyīnā

(||paṭṭa||)
vesadāri mām̐ṭalāḍi veḍuga navvulu navvi
āsala nĕṁta vĕṭṭeve ādani nīvu
ā suddulaḍu vĕṭṭave yaḍuvaṁṭivām̐ḍugām̐ḍu
nā sŏmmayinavām̐ḍu nī sannalagu lonayyīnā

(||paṭṭa||)
sŏlasi sŏlasi sūsi sŏkkulanallām̐bĕṭṭi
yalayiṁchanemiḍige yādani nīvu
salamu lim̐ka mānave sammadiṁcham̐ ḍādam̐ḍu
tŏlude nannelĕ nī pŏṁdulagum̐ jikkīnā

(||paṭṭa||)
kappuramu movim̐ jūbi kām̐giḍigi lām̐si lāsi
appaḍim̐ gŏsareveve yādani nīvu
yippuḍu śhrīveṁkaḍeśhum̐ ḍinniḍānu nannu nelĕ
vŏppagu nā ramaṇum̐ḍu vŏddiga nīgayyīnā