Pattaraani kaamtaalaanam badarem gaani

పట్టరాని కాఁతాళానఁ బదరేఁ గాని
Language

(॥పల్లవి॥)
పట్టరాని కాఁతాళానఁ బదరేఁ గాని
దిట్టైనదానవు నీకు దీకొనగఁ జెల్లునే

(॥పట్ట॥)
కాంతుఁడిచ్చినసలిగెగలదానవుగనక
పంతములాడఁగవద్దా పలుమారును
బంతినుండి యాతనితో పకపక నవ్వేవు
ఇంతటిదానవు నీకు నెట్టుండినాఁ జెల్లునే

(॥పట్ట॥)
ఆతఁడున్నగద్దె యెక్కి అండవాయవుగనక
యేతులు నెరపవద్దా యిచ్చటను
చేతులు చాఁచి పతినిఁజేరి సాములుసేసేవు
బీతిలేనిదానవు పెనఁగఁగఁజెల్లునే

(॥పట్ట॥)
బలిమి మగనిచేత బాసగొంటివి గనక
చలము సాదించవద్దా సారెసారెకు
యిల నన్నలె శ్రీవేంకటేశుఁడని మెచ్చేవు
అలమేలుమంగవు నీకమరు నన్నియును

(||pallavi||)
paṭṭarāni kām̐tāḽānam̐ badarem̐ gāni
diṭṭainadānavu nīgu dīgŏnagam̐ jĕllune

(||paṭṭa||)
kāṁtum̐ḍichchinasaligĕgaladānavuganaga
paṁtamulāḍam̐gavaddā palumārunu
baṁtinuṁḍi yādanido pagabaga navvevu
iṁtaḍidānavu nīgu nĕṭṭuṁḍinām̐ jĕllune

(||paṭṭa||)
ādam̐ḍunnagaddĕ yĕkki aṁḍavāyavuganaga
yedulu nĕrabavaddā yichchaḍanu
sedulu sām̐si padinim̐jeri sāmulusesevu
bīdilenidānavu pĕnam̐gam̐gam̐jĕllune

(||paṭṭa||)
balimi maganiseda bāsagŏṁṭivi ganaga
salamu sādiṁchavaddā sārĕsārĕgu
yila nannalĕ śhrīveṁkaḍeśhum̐ḍani mĕchchevu
alamelumaṁgavu nīgamaru nanniyunu