Pattaraagumte vayasu paamtarambetti daamsugo

పట్టరాకుంటే వయసు పాఁతరఁబెట్టి దాఁచుకో
Language

(॥పల్లవి॥)
పట్టరాకుంటే వయసు పాఁతరఁబెట్టి దాఁచుకో
ఇట్టె బట్టబయలేల యీఁదవచ్చేవే

(॥పట్ట॥)
కూరిమి గొసరుకొంటా కొంకక నాపతితోడ
సారెకు నాడేవేమే జాణతనాలు
నేరుపుగలదంటాను నిండువాని సేసుకొని
పోరచి వలపులేల పొత్తు గలపేవే

(॥పట్ట॥)
బడివాయ కాతనితో పచ్చిమాఁట లాడుకొంటా
నడుమ నప్పటి నేమి నవ్వు నవ్వేనే
బెడిదపు వినయాలు పెదవిపైఁ బెట్టుకొని
బుడి బుడి యాసలేల పోఁగువేసేవే

(॥పట్ట॥)
కుమ్మరింపుదమితోడ గుబ్బలనొరసుకొంటా
వుమ్మగిలు రతులేల వొడిగట్టేవే
ఇమ్ముల శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్ను నేలె
దొమ్మి చుట్టరికా లెన్ని తొరలించుకొనేవే

(||pallavi||)
paṭṭarāguṁṭe vayasu pām̐taram̐bĕṭṭi dām̐sugo
iṭṭĕ baṭṭabayalela yīm̐davachcheve

(||paṭṭa||)
kūrimi gŏsarugŏṁṭā kŏṁkaga nābadidoḍa
sārĕgu nāḍeveme jāṇadanālu
nerubugaladaṁṭānu niṁḍuvāni sesugŏni
porasi valabulela pŏttu galabeve

(||paṭṭa||)
baḍivāya kādanido pachchimām̐ṭa lāḍugŏṁṭā
naḍuma nappaḍi nemi navvu navvene
bĕḍidabu vinayālu pĕdavibaim̐ bĕṭṭugŏni
buḍi buḍi yāsalela pom̐guveseve

(||paṭṭa||)
kummariṁpudamidoḍa gubbalanŏrasugŏṁṭā
vummagilu radulela vŏḍigaṭṭeve
immula śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannu nelĕ
dŏmmi suṭṭarigā lĕnni tŏraliṁchugŏneve