Pattaraadu vogadigim badi yauduvu

పట్టరాదు వొకటికిఁ బది యౌదువు
Language

(॥పల్లవి॥)
పట్టరాదు వొకటికిఁ బది యౌదువు
అట్టె నీవన్నట్టే యవునౌఁ దలఁగరా

(॥పట్ట॥)
యీఁతలు మోఁతలు నీకుయీడకు రాఁ బొద్దులేదు
వూఁతగొని అక్కడనే వుండవయ్యా
చూఁతలకు మోరతోపుసుద్దులవాఁడవు నీ -
లేఁతనవ్వు నెఱుఁగుదు లేలే అంటకురా

(॥పట్ట॥)
అసలు రేసులు నీకు అంతకెల్ల నేనోప
వేసపునీరాజసాలు విడువవయ్య
మోసపోతి ననవద్దు ముదితలయెడలందు
దోసపులూట్లు మాని తోతో తొలఁగరా

(॥పట్ట॥)
సిగ్గులు నెగ్గులు నీకుఁ జెప్పిచూపనేల మాకు
వొగ్గిననీతొక్కుమట్టు కోరువమయ్యా
వెగ్గళించి ఇంతలో శ్రీవేంకటేశ కూడితివి
బొగ్గరపుఁ జింతలెల్ల పోపో మెచ్చాయరా

(||pallavi||)
paṭṭarādu vŏgaḍigim̐ badi yauduvu
aṭṭĕ nīvannaṭṭe yavunaum̐ dalam̐garā

(||paṭṭa||)
yīm̐talu mom̐talu nīguyīḍagu rām̐ bŏdduledu
vūm̐tagŏni akkaḍane vuṁḍavayyā
sūm̐talagu moradobusuddulavām̐ḍavu nī -
lem̐tanavvu nĕṟum̐gudu lele aṁṭagurā

(||paṭṭa||)
asalu resulu nīgu aṁtagĕlla nenoba
vesabunīrājasālu viḍuvavayya
mosabodi nanavaddu mudidalayĕḍalaṁdu
dosabulūṭlu māni todo tŏlam̐garā

(||paṭṭa||)
siggulu nĕggulu nīgum̐ jĕppisūbanela māgu
vŏgginanīdŏkkumaṭṭu koruvamayyā
vĕggaḽiṁchi iṁtalo śhrīveṁkaḍeśha kūḍidivi
bŏggarabum̐ jiṁtalĕlla pobo mĕchchāyarā