Pattaguve salamimta paibai neevu

పట్టకువే చలమింత పైపై నీవు
Language

(॥పల్లవి॥)
పట్టకువే చలమింత పైపై నీవు
యెట్టయిన నీవు నేను యిద్దరము నొక్కటే

(॥పట్టు॥)
చూడకువే వాఁడిచూపు చురుకనీ నా మనసు
అడకువే వేఁడిమాఁట ఆయమంటీని
యేడనైనఁ గర్మఫల మెదిరికిఁ జేసినంత
తోడనే మరలివచ్చు దోసమిది వలెనా

(॥పట్టు॥)
దాఁచకువే నీ గుణము తమకించీ విన్నదాఁక
కాఁచకువే కుచయుగముల కాఁకరేగీని
యేఁచకు ముయికి మఇ యేడనుండినాఁ బోదు
రేఁచినదే వమ్ము సేసీ రిచ్చల యీమాయ

(॥పట్టు॥)
నవ్వకువే నీవు నన్ను నాఁగువారీ వలపులు
దవ్వులఁ జేయి చాఁచకువే తతి వచ్చెను
యివ్వల నిన్ను శ్రీవేంకేశుఁడఁ గూడితి నిట్టె
జవ్వనము నీకు నాకు సరియే యీతగవు

(||pallavi||)
paṭṭaguve salamiṁta paibai nīvu
yĕṭṭayina nīvu nenu yiddaramu nŏkkaḍe

(||paṭṭu||)
sūḍaguve vām̐ḍisūbu suruganī nā manasu
aḍaguve vem̐ḍimām̐ṭa āyamaṁṭīni
yeḍanainam̐ garmaphala mĕdirigim̐ jesinaṁta
toḍane maralivachchu dosamidi valĕnā

(||paṭṭu||)
dām̐saguve nī guṇamu tamagiṁchī vinnadām̐ka
kām̐saguve kusayugamula kām̐karegīni
yem̐sagu muyigi ma̮i yeḍanuṁḍinām̐ bodu
rem̐sinade vammu sesī richchala yīmāya

(||paṭṭu||)
navvaguve nīvu nannu nām̐guvārī valabulu
davvulam̐ jeyi sām̐saguve tadi vachchĕnu
yivvala ninnu śhrīveṁkeśhum̐ḍam̐ gūḍidi niṭṭĕ
javvanamu nīgu nāgu sariye yīdagavu