Pattaguvayyaa maagomgu balimisesi

పట్టకువయ్యా మాకొంగు బలిమిసేసి
Language

(॥పల్లవి॥)
పట్టకువయ్యా మాకొంగు బలిమిసేసి
గుట్టుతో వారముగాక కొసరేటివారమా

(॥పట్ట॥)
నిమ్మకాయలంతేసి నిక్కుఁజన్నులవారము
అమ్మరో నీతో మాటలాడఁగలమా
చిమ్ములసిగ్గులలోనే చిందువందయ్యేవారము
పమ్ముచు నీతో నంతేసిపంతములవారమా

(॥పట్ట॥)
మెల్లనే పిడికెఁడంతమించు నడిమివారము
చెల్లఁబో నీతో పొందుసేయఁగలమా
చల్లువలపులచేత జాజరకాడే వారము
వుల్లము గరఁగ నిన్ను నొరసేటివారమా

(॥పట్ట॥)
పుటపుట మొలచేటి పూఁపవయసు వారము
కటకటా రతి నిన్నాఁగఁ గఁ గలమా
ఇటు శ్రీవేంకటేశ్వర యే నలమేలుమంగను
తటుకనఁ గూడితివి తప్పేలెంచేవారమా

(||pallavi||)
paṭṭaguvayyā māgŏṁgu balimisesi
guṭṭudo vāramugāga kŏsareḍivāramā

(||paṭṭa||)
nimmagāyalaṁtesi nikkum̐jannulavāramu
ammaro nīdo māḍalāḍam̐galamā
simmulasiggulalone siṁduvaṁdayyevāramu
pammusu nīdo naṁtesibaṁtamulavāramā

(||paṭṭa||)
mĕllane piḍigĕm̐ḍaṁtamiṁchu naḍimivāramu
sĕllam̐bo nīdo pŏṁduseyam̐galamā
salluvalabulaseda jājaragāḍe vāramu
vullamu garam̐ga ninnu nŏraseḍivāramā

(||paṭṭa||)
puḍabuḍa mŏlaseḍi pūm̐pavayasu vāramu
kaḍagaḍā radi ninnām̐gam̐ gam̐ galamā
iḍu śhrīveṁkaḍeśhvara ye nalamelumaṁganu
taḍuganam̐ gūḍidivi tappelĕṁchevāramā