పట్టకు పట్టకు నన్ను బలిమి నీవు
(॥పల్లవి॥)
పట్టకు పట్టకు నన్ను బలిమి నీవు
చుట్టుకొని యింత మమ్ము సోఁకఁగ నేమిటికి
(॥పట్ట॥)
సిగ్గులు నెగ్గులకును శిరసువంపులు దాపు
కగ్గులేని చెక్కులకు కళలుదాపు
నిగ్గులాపెచన్నులకు నీమే నిదియెదాపు
దగ్గరి మాకైదండదాపులు నీకేఁటికి
(॥పట్ట॥)
జలజాక్షి వయసునకు జవ్వనమదమె దాపు
సొలసే సొలపులకు చూపులు దాపు
పలు సోఁకులకు నెల్ల పచ్చి నీమోవె దాపు
తల నిద్రకు మా తొడదాపులు నీకేఁటికే
(॥పట్ట॥)
ననుపులిన్నింటికి నీ నవ్వేటి నవ్వులు దాపు
కనుచూపులకు రతికందువ దాపు
యెనసి శ్రీ వేంకటేశ యీడ నన్నుఁగూడితివి
మనసిజ తంత్రాలు మా మంచముదా పేఁటికి
(||pallavi||)
paṭṭagu paṭṭagu nannu balimi nīvu
suṭṭugŏni yiṁta mammu som̐kam̐ga nemiḍigi
(||paṭṭa||)
siggulu nĕggulagunu śhirasuvaṁpulu dābu
kagguleni sĕkkulagu kaḽaludābu
niggulābĕsannulagu nīme nidiyĕdābu
daggari māgaidaṁḍadābulu nīgem̐ṭigi
(||paṭṭa||)
jalajākṣhi vayasunagu javvanamadamĕ dābu
sŏlase sŏlabulagu sūbulu dābu
palu som̐kulagu nĕlla pachchi nīmovĕ dābu
tala nidragu mā tŏḍadābulu nīgem̐ṭige
(||paṭṭa||)
nanubulinniṁṭigi nī navveḍi navvulu dābu
kanusūbulagu radigaṁduva dābu
yĕnasi śhrī veṁkaḍeśha yīḍa nannum̐gūḍidivi
manasija taṁtrālu mā maṁchamudā pem̐ṭigi