Paruvam vaanagaa nedu kurisenule....

పరువం వానగా నేడు కురిసేనులే....
Work
Year
Language

పల్లవి:

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె
నా ఒడిలోన ఒక వేడి సెగ రేగేనే
ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే

నదివే నీవైతే అల నేనే
ఒక పాటా నీవైతే నీరాగం నేనే

పరువం వానగా నేడు కురిసేనులే
ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులె

చరణం 1:

నీ చిగురాకు చూపులే అవి నా ముత్యాల సిరులే
నీ చిన్నారి ఊసులే అవి నా బంగారు నిధులే
నీ పాల పొంగులలో తేలనీ నీ గుండెలో నిండనీ
నీ నీడలా వెంట సాగనీ నీ కళ్ళల్లో కొలువుండనీ

చరణం 2:

నీ గారాల చూపులే నాలో రేపెను మొహం
నీ మందార నవ్వులే నాకే వేసెను బంధం
నా లేత మధురాల ప్రేమలో నీ కలలు పండించుకో
నా రాగబంధాల చాటులో నీ పరువాలు పలికించుకో

pallavi:

paruvaṁ vānagā neḍu kurisenule
muddu muribālalo īḍu taḍisenulĕ
nā ŏḍilona ŏga veḍi sĕga regene
ā saḍilona ŏga toḍu ĕda korĕne

paruvaṁ vānagā neḍu kurisenule
muddu muribālalo īḍu taḍisenulĕ
nā ŏḍilona ŏga veḍi sĕga regene
ā saḍilona ŏga toḍu ĕda korĕne

nadive nīvaide ala nene
ŏga pāḍā nīvaide nīrāgaṁ nene

paruvaṁ vānagā neḍu kurisenule
muddu muribālalo īḍu taḍisenulĕ

saraṇaṁ 1:

nī sigurāgu sūbule avi nā mutyāla sirule
nī sinnāri ūsule avi nā baṁgāru nidhule
nī pāla pŏṁgulalo telanī nī guṁḍĕlo niṁḍanī
nī nīḍalā vĕṁṭa sāganī nī kaḽḽallo kŏluvuṁḍanī

saraṇaṁ 2:

nī gārāla sūbule nālo rebĕnu mŏhaṁ
nī maṁdāra navvule nāge vesĕnu baṁdhaṁ
nā leda madhurāla premalo nī kalalu paṁḍiṁchugo
nā rāgabaṁdhāla sāḍulo nī paruvālu paligiṁchugo