Parusavedi vamtidi bhaamalagu neegaruna

పరుసవేది వంటిది భామలకు నీకరుణ
Language

(॥పల్లవి॥)
పరుసవేది వంటిది భామలకు నీకరుణ
మరిగిన నాచిత్తమే మరవనీదు గాక

(॥॥)
చేతులెత్తి నాపై నీవు సేసవట్టితేఁ జాలదా
రీతితో నాయస కొసరించీఁ గాక
నాతో నీవొకమాటు నవ్వితేనే చాలదా
కాతరపునాగుణము కడిమించీఁగాక

(॥॥)
మనసిచ్చి నీవించుక మాటాడితేఁ జాలదా
యెననేవేడుక సొలయించీఁ గాక
చెనకి నీవు నన్నుఁ జూచితేనే చాలదా
తనియని నావలపు తగిలించీఁ గాక

(॥॥)
వొబ్బిడిగా నాయింట నీవుండితేనే చాలదా
గుబ్బలగర్వము నినుఁ గూడించీఁ గాక
అబ్బిన శ్రీవేంకటేశ అలమేల్మంగను నేను
వుబ్బించే విది చాలదా వొరసేఁ గాక

(||pallavi||)
parusavedi vaṁṭidi bhāmalagu nīgaruṇa
marigina nāsittame maravanīdu gāga

(||||)
sedulĕtti nābai nīvu sesavaṭṭidem̐ jāladā
rīdido nāyasa kŏsariṁchīm̐ gāga
nādo nīvŏgamāḍu navvidene sāladā
kādarabunāguṇamu kaḍimiṁchīm̐gāga

(||||)
manasichchi nīviṁchuga māḍāḍidem̐ jāladā
yĕnaneveḍuga sŏlayiṁchīm̐ gāga
sĕnagi nīvu nannum̐ jūsidene sāladā
taniyani nāvalabu tagiliṁchīm̐ gāga

(||||)
vŏbbiḍigā nāyiṁṭa nīvuṁḍidene sāladā
gubbalagarvamu ninum̐ gūḍiṁchīm̐ gāga
abbina śhrīveṁkaḍeśha alamelmaṁganu nenu
vubbiṁche vidi sāladā vŏrasem̐ gāga