పల్లవి:
పన్లు కట్టిపెట్టు పెళ్ళామా
పతిని కాస్త చూసి వెళ్ళుమా
హ్యాపీగా లైఫే ఎంజాయ్ చెయ్
డే అండ్ నైట్ తేడా చెరిపేసెయ్
What a thrill wondeful
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులే రన్నో చిన్నన్నా
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులే రన్నో చిన్నన్నా
చరణం 1:
వేర్ ఆర్ యు మై డియర్.. హేయ్
బాత్రూంలో ప్రెజెంట్ సార్
హా నేనూ వస్తా తీసెయ్ డోరు
వస్తే తంతా మూసెయ్ నోరు
సరసంగా సరిగంగా స్నానం చేద్దాంలే
సాయంత్రం ఆ సంగతేదో చూద్దాంలే
కుక్కరేమో కూతవేసే పోయిదాని ప్రెషరు దించవా
పన్లు కట్టిపెట్టు పెళ్ళామా
పతిని కాస్త చూసి వెళ్ళుమా
చరణం 2:
కావాలే కిస్సులు
టైం లేదోయ్ మిస్టరు
వచ్చేసిందే అయ్యయ్యయ్యో బెడ్రూం మూడు
ఆఫీస్ లేదా.. అబ్బాయిగారు
నువ్వుంటే ఆఫీసుగీఫీసు జాంతానై నై నై
బాసంటే భయమైనా లేదా బుజ్జబ్బాయ్
ముచ్చటైన భార్యకంటె బాసుగీసు ఇంక ఎవ్వరు
పన్లు కట్టిపెట్టు పెళ్ళామా
పతిని కాస్త చూసి వెళ్ళుమా
హ్యాపీగా లైఫే ఎంజాయ్ చెయ్
డే అండ్ నైట్ తేడా చెరిపేసెయ్
What a thrill wondeful
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులే రన్నో చిన్నన్నా
ఏరువాకా సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునులే రన్నో చిన్నన్నా