Pamtamunam gasaridem badigi sevayagunu

పంతమునఁ గసరితేఁ బతికి సేవయగును
Language

(॥పల్లవి॥)
పంతమునఁ గసరితేఁ బతికి సేవయగును
వింత సేసుకొనరాదు వివేకపు సతికి

(॥పంత॥)
సోలి సవతులు యెన్ని సొలసి మాటాడినా
తాలిమే వలెను వుత్తమురాలికి
యేలాటా మాడి మగని కెంతయెమ్మెలు చూపినా
వాలాయించి సంతోసించవలె నేరుపరికి

(॥పంత॥)
తవిలి తనపాటికి తరుణులు వెనఁగితే
చవిచేసుకొనవలె జాణకత్తెను
రవళి దాఁ జూడఁగానే రమణునితో నవ్వితే -
నవల దా గూడి నవ్వనగు నయగారికి

(॥పంత॥)
పొరుగువా రతనికి బొంచి సన్నలుసేసితే
పరాకు సేయగఁదగు బాగరికిని
ధర నలమేల్ మంగ వాతడు శ్రీవేంకటేశుఁడు
వరుసఁ గూడి తిట్టుండవలెఁ జతురికకు

(||pallavi||)
paṁtamunam̐ gasaridem̐ badigi sevayagunu
viṁta sesugŏnarādu vivegabu sadigi

(||paṁta||)
soli savadulu yĕnni sŏlasi māḍāḍinā
tālime valĕnu vuttamurāligi
yelāḍā māḍi magani kĕṁtayĕmmĕlu sūbinā
vālāyiṁchi saṁtosiṁchavalĕ nerubarigi

(||paṁta||)
tavili tanabāḍigi taruṇulu vĕnam̐gide
savisesugŏnavalĕ jāṇagattĕnu
ravaḽi dām̐ jūḍam̐gāne ramaṇunido navvide -
navala dā gūḍi navvanagu nayagārigi

(||paṁta||)
pŏruguvā radanigi bŏṁchi sannaluseside
parāgu seyagam̐dagu bāgarigini
dhara nalamel maṁga vādaḍu śhrīveṁkaḍeśhum̐ḍu
varusam̐ gūḍi tiṭṭuṁḍavalĕm̐ jadurigagu