Pamtamulichchina meemdaa balimela

పంతములిచ్చిన మీఁదా బలిమేల
Language

(॥పల్లవి॥)
పంతములిచ్చిన మీఁదా బలిమేల
సంతకూటముల పొందు చవిచెప్పఁ జూతురా

(॥పంత॥)
చిగురాయఁ జిత్తము శిరసుకు(కొ?)మ్ముడి జారె
మగుడి మాతో నవ్వులు మానరాదా
యెగసక్కే లింతేసి యెవ్వతె నేరిపె నీకు
వొగరైతే వలపులు వొడిఁ బెట్టుకొందురా

(॥పంత॥)
గొప్పలాయఁ జన్నులు కొనగోరు గురులాయ
దప్పిదేర మమ్ము దయదలఁచరాదా
ఇప్పటినీవోజలు యెన్నాళ్లు చదివితివి
పిప్పి గట్టితే వయసు పిండి వేతురా

(॥పంత॥)
తేనె గారెఁ గేమ్మోవి తేటలాయఁ గనుచూపు
మోనాన నీపాద మిట్టె మోపరాదా
యీనయాన శ్రీ వేంకటేశ నన్నుఁ గూడితివి
నానితేనే రతులను నలి నలి సేతురా

(||pallavi||)
paṁtamulichchina mīm̐dā balimela
saṁtagūḍamula pŏṁdu savisĕppam̐ jūdurā

(||paṁta||)
sigurāyam̐ jittamu śhirasugu(kŏ?)mmuḍi jārĕ
maguḍi mādo navvulu mānarādā
yĕgasakke liṁtesi yĕvvadĕ neribĕ nīgu
vŏgaraide valabulu vŏḍim̐ bĕṭṭugŏṁdurā

(||paṁta||)
gŏppalāyam̐ jannulu kŏnagoru gurulāya
dappidera mammu dayadalam̐sarādā
ippaḍinīvojalu yĕnnāḽlu sadividivi
pippi gaṭṭide vayasu piṁḍi vedurā

(||paṁta||)
tenĕ gārĕm̐ gemmovi teḍalāyam̐ ganusūbu
monāna nībāda miṭṭĕ mobarādā
yīnayāna śhrī veṁkaḍeśha nannum̐ gūḍidivi
nānidene radulanu nali nali sedurā