Pamtamulemtigi padamtidoda nee

పంతములేఁటికి పడఁటితోడ నీ
Language

(॥పల్లవి॥)
పంతములేఁటికి పడఁటితోడ నీ-
సంతసములే పైఁజల్లఁ గదయ్యా

(॥పంత॥)
అనఁగుచుఁ బెనఁగుచు ఆయములంటుచు
చనవులు మెరసీ జవరాలు
కినియక యిఁక నీకేలు చాఁచి సతి
మనవులు చేకొని మన్నించవయ్యా

(॥పంత॥)
మొక్కుచు నిక్కుచు మొరఁగులు చూపుచు
దక్కఁగొనీ నిను దరలాక్షి
తక్కులఁ బెట్టక దయతో నవ్వుచు
చెక్కునొక్కి రక్షించఁగదయ్యా

(॥పంత॥)
కప్పుచుఁ బయ్యెద కాఁగిట బిగియుచు
పిప్పిసేసె నినుఁ బ్రియురాలు
యిప్పుడె శ్రీ వేంకటేశ కూడితివి
తప్పుదీర దయ దలఁచఁగదయ్యా

(||pallavi||)
paṁtamulem̐ṭigi paḍam̐ṭidoḍa nī-
saṁtasamule paim̐jallam̐ gadayyā

(||paṁta||)
anam̐gusum̐ bĕnam̐gusu āyamulaṁṭusu
sanavulu mĕrasī javarālu
kiniyaga yim̐ka nīgelu sām̐si sadi
manavulu segŏni manniṁchavayyā

(||paṁta||)
mŏkkusu nikkusu mŏram̐gulu sūbusu
dakkam̐gŏnī ninu daralākṣhi
takkulam̐ bĕṭṭaga dayado navvusu
sĕkkunŏkki rakṣhiṁcham̐gadayyā

(||paṁta||)
kappusum̐ bayyĕda kām̐giḍa bigiyusu
pippisesĕ ninum̐ briyurālu
yippuḍĕ śhrī veṁkaḍeśha kūḍidivi
tappudīra daya dalam̐sam̐gadayyā