(॥పల్లవి॥)
పంతములే లాడేవే పతితోను
ఇంతంతని నీకతలు యెట్టు చెప్పవచ్చునే
(॥పంత॥)
నగుతానే వచ్చి నాఁటుకొను వలపులు
మొగము చూడఁగానే ముంచును తమి
చిగురువలెఁ బొడమి చిమ్మిరేఁగు సరసాలు
మగువ యెట్టెరిఁగేమే మనసులో సుద్దులు
(॥పంత॥)
మాట మాట వాసులనే మరిగించుఁ గోరికలు
చీటికి మాటికి వచ్చు సెలవి నవ్వు
చాటి చెప్పి పొందు సాగఁజేయు ననుపులు
యాటువెట్టి మదరాగ మెంచ నెట్టువచ్చునే
(॥పంత॥)
యెదురెదురనే వుండి యెలఇందు సింగారాలు
కదిసి పాయనియ్యవు కడురతులు
ఇదివో శ్రీవేంకటేశుఁ డింతలోనే నిన్నుఁగూడె
పదివేలకు వయసు పట్టనెట్టువచ్చునే
(||pallavi||)
paṁtamule lāḍeve padidonu
iṁtaṁtani nīgadalu yĕṭṭu sĕppavachchune
(||paṁta||)
nagudāne vachchi nām̐ṭugŏnu valabulu
mŏgamu sūḍam̐gāne muṁchunu tami
siguruvalĕm̐ bŏḍami simmirem̐gu sarasālu
maguva yĕṭṭĕrim̐geme manasulo suddulu
(||paṁta||)
māḍa māḍa vāsulane marigiṁchum̐ gorigalu
sīḍigi māḍigi vachchu sĕlavi navvu
sāḍi sĕppi pŏṁdu sāgam̐jeyu nanubulu
yāḍuvĕṭṭi madarāga mĕṁcha nĕṭṭuvachchune
(||paṁta||)
yĕdurĕdurane vuṁḍi yĕla̮iṁdu siṁgārālu
kadisi pāyaniyyavu kaḍuradulu
idivo śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone ninnum̐gūḍĕ
padivelagu vayasu paṭṭanĕṭṭuvachchune