పంతము లే లాడీనమ్మా పలుమారు రమణుఁడు
(॥పల్లవి॥)
పంతము లే లాడీనమ్మా పలుమారు రమణుఁడు
చెంత నా కిచ్చకములే సేసీఁగాక
(॥పంత॥)
మగువల మాఁటలే మదురాలు
మొగము చూపులే మోహనాలు
నగిన చిరునవ్వులే నానఁబాలు
తగుల కెట్టుండునమ్మా తానాపె పసలను
(॥పంత॥)
వనితల వినయాలే వడఁగండ్లు
కొనచూపు లవియె చొక్కునుందులు
వొనరిన సరసాలే వుడుగరలు
పెనఁగ కెట్టుండునమ్మా ప్రేమ నాపె కాఁగిట
(॥పంత॥)
వెలఁదుల కాఁగిళ్లే వీఁడు బట్లు
వెళగని రతులే పెను సాములు
యెలమి శ్రీవేంకటేశుఁ డేలె నన్ను
తలఁచ కెట్టుండునమ్మా తగ నాపె పొందులు
(||pallavi||)
paṁtamu le lāḍīnammā palumāru ramaṇum̐ḍu
sĕṁta nā kichchagamule sesīm̐gāga
(||paṁta||)
maguvala mām̐ṭale madurālu
mŏgamu sūbule mohanālu
nagina sirunavvule nānam̐bālu
tagula kĕṭṭuṁḍunammā tānābĕ pasalanu
(||paṁta||)
vanidala vinayāle vaḍam̐gaṁḍlu
kŏnasūbu laviyĕ sŏkkunuṁdulu
vŏnarina sarasāle vuḍugaralu
pĕnam̐ga kĕṭṭuṁḍunammā prema nābĕ kām̐giḍa
(||paṁta||)
vĕlam̐dula kām̐giḽle vīm̐ḍu baṭlu
vĕḽagani radule pĕnu sāmulu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍelĕ nannu
talam̐sa kĕṭṭuṁḍunammā taga nābĕ pŏṁdulu