Pamtamaadidi vimdaamkaa padidodanu

పంతమాడితి విందాఁకా పతితోడను
Language

(॥పల్లవి॥)
పంతమాడితి విందాఁకా పతితోడను
వింతలుగా మేలమాడి వీడెమిచ్చె నిపుడు

(॥పంత॥)
నెట్టుకొన్న వలపులు నేరము లెంచఁగ నీదు
చుట్టరికములే రేఁచి చొక్కించుఁగాని
పట్టరాని జవ్వనము పాసి యోరువఁగ నీదు
బెట్టుగాఁ బ్రియములే చెప్పించుఁగాని

(॥పంత॥)
యెనసిన మనసైతే యెరవు సేయఁగ నీదు
పెనఁగించి కోరికలే పెంచుఁగాని
మునుకొన్న తమకము మోనాన నుండఁగ నీదు
అనిశము మోవితేనె లడిగించుఁగాని

(॥పంత॥)
చెదరని యడియాస సిగ్గులువడఁగ నీదు
కొదలేక కాఁగిటనుఁ గూరుచుఁగాని
యిదివో శ్రీవేంకటేశు నెనసి మెప్పించితివి
యెదుట నీగుణాలే నిన్నింత సేసుఁగాని

(||pallavi||)
paṁtamāḍidi viṁdām̐kā padidoḍanu
viṁtalugā melamāḍi vīḍĕmichchĕ nibuḍu

(||paṁta||)
nĕṭṭugŏnna valabulu neramu lĕṁcham̐ga nīdu
suṭṭarigamule rem̐si sŏkkiṁchum̐gāni
paṭṭarāni javvanamu pāsi yoruvam̐ga nīdu
bĕṭṭugām̐ briyamule sĕppiṁchum̐gāni

(||paṁta||)
yĕnasina manasaide yĕravu seyam̐ga nīdu
pĕnam̐giṁchi korigale pĕṁchum̐gāni
munugŏnna tamagamu monāna nuṁḍam̐ga nīdu
aniśhamu movidenĕ laḍigiṁchum̐gāni

(||paṁta||)
sĕdarani yaḍiyāsa sigguluvaḍam̐ga nīdu
kŏdalega kām̐giḍanum̐ gūrusum̐gāni
yidivo śhrīveṁkaḍeśhu nĕnasi mĕppiṁchidivi
yĕduḍa nīguṇāle ninniṁta sesum̐gāni