Pamdida nehroo puttinaroju

పండిత నెహ్రూ పుట్టినరోజు
Year
Language

పల్లవి:

పండిత నెహ్రూ పుట్టినరోజు
పాపలందరికి పుట్టినరోజు
మమత సమత పుట్టినరోజు
మంచికి కోవెల కట్టినరోజు

చరణం 1:

ముత్యంలాంటి మోతీలాలుకు
రత్నంలా జన్మించాడు
జాతిరత్నమై వెలిగి
ఇంకొక జాతిరత్నమును కన్నాడు
అతడే జవహర్‌లాలు
అతనికి మన జేజేలు

చరణం 2:

తలపై తెల్లని టోపీ ఎదపై ఎర్రగులాబీ !!2!!

పెదవులపై చిరునవ్వు
మదిలో పున్నమి పువ్వు
చేతిలో పావురం
మనజాతికి అతడే గోపురం !!2!!

చరణం 3:

మహత్మాగాంధీ అడుగుజాడలో
స్వరాజ్య సమరం నడిపాడు
రణదాహంతో రగిలే జగతిని
శాంతి సుధలు కురిపించాడు
కన్నుమూసిన జవహర్‌లాల్
కంటిపాపగా ఉన్నాడు
ఇంటింట జ్యోతిగా ఉన్నాడు
చాచా నెహ్రూ అమర్ రహే
చాచా నెహ్రూ అమర్ రహే
అమర్ రహే....

pallavi:

paṁḍida nĕhrū puṭṭinaroju
pābalaṁdarigi puṭṭinaroju
mamada samada puṭṭinaroju
maṁchigi kovĕla kaṭṭinaroju

saraṇaṁ 1:

mutyaṁlāṁṭi modīlālugu
ratnaṁlā janmiṁchāḍu
jādiratnamai vĕligi
iṁkŏga jādiratnamunu kannāḍu
adaḍe javahar‌lālu
adanigi mana jejelu

saraṇaṁ 2:

talabai tĕllani ṭobī ĕdabai ĕrragulābī !!2!!

pĕdavulabai sirunavvu
madilo punnami puvvu
sedilo pāvuraṁ
manajādigi adaḍe goburaṁ !!2!!

saraṇaṁ 3:

mahatmāgāṁdhī aḍugujāḍalo
svarājya samaraṁ naḍibāḍu
raṇadāhaṁto ragile jagadini
śhāṁti sudhalu kuribiṁchāḍu
kannumūsina javahar‌lāl
kaṁṭibābagā unnāḍu
iṁṭiṁṭa jyodigā unnāḍu
sāsā nĕhrū amar rahe
sāsā nĕhrū amar rahe
amar rahe....