పల్లవి:
పలుకరాదటే
పలుకరాదటే చిలుకా పలుకరాదటే
సముఖములో రాయబారమెందులకే
చరణం 1:
ఎరుగని వారమటే? మొగమెరుగని వారమటే! ||2||
పలికిన నేరమటే? పలుకాడగ నేరవటే
ఇరుగు పొరుగు వారలకీ అరమరికలు తగునటనే
||పలుకరాదటే||
చరణం 2:
(మనసున తొణికే మమకారాలు
కనులను మెరిసే నయగారాలు) ||2||
తెలుపరాదటే సూటిగా, తెరలు తీసి పరిపాటిగా ||2||
||పలుకరాదటే||
pallavi:
palugarādaḍe
palugarādaḍe silugā palugarādaḍe
samukhamulo rāyabāramĕṁdulage
saraṇaṁ 1:
ĕrugani vāramaḍe? mŏgamĕrugani vāramaḍe! ||2||
paligina neramaḍe? palugāḍaga neravaḍe
irugu pŏrugu vāralagī aramarigalu tagunaḍane
||palugarādaḍe||
saraṇaṁ 2:
(manasuna tŏṇige mamagārālu
kanulanu mĕrise nayagārālu) ||2||
tĕlubarādaḍe sūḍigā, tĕralu tīsi paribāḍigā ||2||
||palugarādaḍe||