Paligenamte gadum bachchiderunu

పలికెనంటే గడుఁ బచ్చిదేరును
Language

(॥పల్లవి॥)
పలికెనంటే గడుఁ బచ్చిదేరును
చెలప చెమటలతో చెక్కులు నొక్కినది

(॥పలి॥)
మనసున నెన్నటికి మఱవకు మిఁక నీవు
ననుపున నిటు నన్ను నమ్మించినది
యెనసి మరీనొకటి యెఱుఁగుదు వది నీవు
పెనగి యేకతమునఁ బ్రియము చెప్పినది

(॥పలి॥)
వడి నాచుట్టరికము వదలకు మిఁక నీవు
కడలేక బత్తి నాపైఁ గలిగినది
చిడుముడిఁ దొల్లె నాకుఁ జెప్పిపంపితివి
అడియాలముగ నాఁడె యాసలఁబెట్టినది

(॥పలి॥)
పరగ నాకాఁగిటఁ బాయకు మిఁక నీవు
సిరుల నాపై దయసేసినది
నిరతి శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
గరిమ గూడితివి తార్కాణలయినది

(||pallavi||)
paligĕnaṁṭe gaḍum̐ bachchiderunu
sĕlaba sĕmaḍalado sĕkkulu nŏkkinadi

(||pali||)
manasuna nĕnnaḍigi maṟavagu mim̐ka nīvu
nanubuna niḍu nannu nammiṁchinadi
yĕnasi marīnŏgaḍi yĕṟum̐gudu vadi nīvu
pĕnagi yegadamunam̐ briyamu sĕppinadi

(||pali||)
vaḍi nāsuṭṭarigamu vadalagu mim̐ka nīvu
kaḍalega batti nābaim̐ galiginadi
siḍumuḍim̐ dŏllĕ nāgum̐ jĕppibaṁpidivi
aḍiyālamuga nām̐ḍĕ yāsalam̐bĕṭṭinadi

(||pali||)
paraga nāgām̐giḍam̐ bāyagu mim̐ka nīvu
sirula nābai dayasesinadi
niradi śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
garima gūḍidivi tārgāṇalayinadi