Pagadi pooda samdra bimbamagubimchenu

పగటి పూట చంద్ర బింబమగుపించెను
Year
Language

పల్లవి:

విరిసిన ఇంద్ర చాపమో...
భువిన్ ప్రభవించిన చంద్ర బింబమో...
మరు పువుబంతియో.. రతియో.. మల్లెల దొంతియో.. మోహకాంతియో
సరస కవీంద్ర కల్పిత రసాకృతియో .. నవ రాగ గీతియో ఓ...
వర సరసీరుహానన ..విరాన.. వరించి.. తరింప చేయవే...ఏ ఏ ఏ ఏ...

పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది

కానరాని మన్మథుడేమో కనిపించెను
ఏడీ?.. ఏడీ?
ఎదుట ఉన్న నీవేలే ఇంకా ఎవరోయి

చరణం 1:

వన్నె వన్నె తారలెన్నో కన్ను గీటి రమ్మన్నాయి (2)
ఏవి?.. ఏవి?
అవి నీ సిగలోనే ఉన్నాయి

పదును పదును బాణాలేవో యెదను నాటుకుంటున్నాయి (2)
ఏవి?.. ఏవి?
అవి నీ ఓర చూపులేనోయి

పగటి పూట చంద్ర బింబం అగుపించెను
ఏదీ?.. ఏదీ?
అందమైన నీ మోమే అది గాకింకేది

చరణం 2:

ఇంత చిన్న కనుపాపలలో..ఎలా నీవు దాగున్నావు? (2)
ఇంత లేత వయసున నీవు ఎంత హొయలు కురిపించావు? (2)
ఏమో?.. ఏమో?

ఇరువురి మనసులు ఒకటైతే ఇంతే ఇంతేనేమో...

ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో
ఆహాహా హాహహాహా ఓహొహోహో హోహో

pallavi:

virisina iṁdra sābamo...
bhuvin prabhaviṁchina saṁdra biṁbamo...
maru puvubaṁtiyo.. radiyo.. mallĕla dŏṁtiyo.. mohagāṁtiyo
sarasa kavīṁdra kalbida rasākṛtiyo .. nava rāga gīdiyo o...
vara sarasīruhānana ..virāna.. variṁchi.. tariṁpa seyave...e e e e...

pagaḍi pūḍa saṁdra biṁbaṁ agubiṁchĕnu
edī?.. edī?
aṁdamaina nī mome adi gāgiṁkedi

kānarāni manmathuḍemo kanibiṁchĕnu
eḍī?.. eḍī?
ĕduḍa unna nīvele iṁkā ĕvaroyi

saraṇaṁ 1:

vannĕ vannĕ tāralĕnno kannu gīḍi rammannāyi (2)
evi?.. evi?
avi nī sigalone unnāyi

padunu padunu bāṇālevo yĕdanu nāḍuguṁṭunnāyi (2)
evi?.. evi?
avi nī ora sūbulenoyi

pagaḍi pūḍa saṁdra biṁbaṁ agubiṁchĕnu
edī?.. edī?
aṁdamaina nī mome adi gāgiṁkedi

saraṇaṁ 2:

iṁta sinna kanubābalalo..ĕlā nīvu dāgunnāvu? (2)
iṁta leda vayasuna nīvu ĕṁta hŏyalu kuribiṁchāvu? (2)
emo?.. emo?

iruvuri manasulu ŏgaḍaide iṁte iṁtenemo...

āhāhā hāhahāhā ohŏhoho hoho
āhāhā hāhahāhā ohŏhoho hoho