పతులకు సతులకుఁ బాయరానిజాడ లివి
(॥పల్లవి॥)
పతులకు సతులకుఁ బాయరానిజాడ లివి
ఇతవు సేసుకొంటే నేమీ నెంచనేఁటికి
(॥॥)
వయసే చక్కఁదనము వర్ణించి చూచితేను
ప్రియమే వలపులకుఁ బెనుఁబోది
నయగారితనములే ననుపులకు మూలము
చెయిఁ జెయిసోఁకుటే చెలిమికి గురుతు
(॥॥)
మనసే పొంతనము మచ్చికలు సేసుకొంటే
పెనగొన్న చూపులే పెడరేఁపులు
వినయపుమాటలే వేడుకతగులాలు
వినుకలియానందమే వియ్యపుసమ్మందము
(॥॥)
సెలవులనవ్వులే సిగ్గులలోనిచవులు
వులివచ్చిచెనకులే వొడఁ బాటులు
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలేనె నన్నుఁ గూడె
వెలయ మోవితేనెలు వెలలేనివిందులు
(||pallavi||)
padulagu sadulagum̐ bāyarānijāḍa livi
idavu sesugŏṁṭe nemī nĕṁchanem̐ṭigi
(||||)
vayase sakkam̐danamu varṇiṁchi sūsidenu
priyame valabulagum̐ bĕnum̐bodi
nayagāridanamule nanubulagu mūlamu
sĕyim̐ jĕyisom̐kuḍe sĕlimigi gurudu
(||||)
manase pŏṁtanamu machchigalu sesugŏṁṭe
pĕnagŏnna sūbule pĕḍarem̐pulu
vinayabumāḍale veḍugadagulālu
vinugaliyānaṁdame viyyabusammaṁdamu
(||||)
sĕlavulanavvule siggulalonisavulu
vulivachchisĕnagule vŏḍam̐ bāḍulu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalenĕ nannum̐ gūḍĕ
vĕlaya movidenĕlu vĕlaleniviṁdulu