Padigarune dikku padivelagunu naagu

పతికరుణే దిక్కు పదివేలకును నాకు
Language

(॥పల్లవి॥)
పతికరుణే దిక్కు పదివేలకును నాకు
రతుల నా యాసోదాలు రచ్చ సేసీనటవే

(॥పతి॥)
అరిదినాకోరికలే యాతనిపైఁ బారఁగాను
మరుఁ డేమిసేసునే మగువలాల
సొరిదిఁ దప్పకచూచేచూపులే తగిలీఁగాక
విరులబాణములైతే వెసఁ దాఁకీనటవే

(॥పతి॥)
కిందువ నావలపులే కడుఁ దమిరేఁచఁగాను
చందురుఁ డేమి సేసునే సకియలాల
చిందిననాతలఁపులే జిగురువలె నంటఁగా
గందము బాసటమై కమ్ముకొనీనటవే

(॥పతి॥)
మలసి యాడించేయెడమాటలే ఇంతసేయఁగా
చిలుక లేమిసేసునే చెలియలాల
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలో వచ్చినన్నేలె
చలువపన్నీరు మరి సాదించీనటరే

(||pallavi||)
padigaruṇe dikku padivelagunu nāgu
radula nā yāsodālu rachcha sesīnaḍave

(||padi||)
aridināgorigale yādanibaim̐ bāram̐gānu
marum̐ ḍemisesune maguvalāla
sŏridim̐ dappagasūsesūbule tagilīm̐gāga
virulabāṇamulaide vĕsam̐ dām̐kīnaḍave

(||padi||)
kiṁduva nāvalabule kaḍum̐ damirem̐sam̐gānu
saṁdurum̐ ḍemi sesune sagiyalāla
siṁdinanādalam̐pule jiguruvalĕ naṁṭam̐gā
gaṁdamu bāsaḍamai kammugŏnīnaḍave

(||padi||)
malasi yāḍiṁcheyĕḍamāḍale iṁtaseyam̐gā
siluga lemisesune sĕliyalāla
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo vachchinannelĕ
saluvabannīru mari sādiṁchīnaḍare