Padamtiro nee vemtigi pamtamulaada vachchevu

పడఁతిరో నీ వేఁటికి పంతములాడ వచ్చేవు
Language

(॥పల్లవి॥)
పడఁతిరో నీ వేఁటికి పంతములాడ వచ్చేవు
అడియాలా లెల్లా గంటి వౌఁగాదనఁగలవా

(॥పడఁ॥)
కొమ్మ బొమ్మవిండ్లను గురులేసీ నీమీఁద
చిమ్మి వొడ్డించుక సాముసేయఁగలవా
కమ్మటిఁ జిరునవ్వుల కప్రవసంతము చల్లీ
నెమ్మది నాకె ముందర నిలువఁగఁగలవా

(॥పడఁ॥)
నెలఁత చనుగుబ్బల నిమ్మపండ్లె గరవేసీ
బలిమి నీ చేతులను పట్టఁగలవా
సళుపుల మాటల చలివంది లిదె పెట్టీ
కలసి యందుకు లోనుగాకుండఁగలవా

(॥పడఁ॥)
మగువ మోవి సన్నల మచ్చులు వేసీ నవిగో
తగులు వడక నీవు దాయగలవా
నిగిడి శ్రీవేంకటేశ నీ వేకె గూడితివి
తగిలీ నిన్ను రతులఁ దప్పించుకోఁగలవా

(||pallavi||)
paḍam̐tiro nī vem̐ṭigi paṁtamulāḍa vachchevu
aḍiyālā lĕllā gaṁṭi vaum̐gādanam̐galavā

(||paḍam̐||)
kŏmma bŏmmaviṁḍlanu gurulesī nīmīm̐da
simmi vŏḍḍiṁchuga sāmuseyam̐galavā
kammaḍim̐ jirunavvula kapravasaṁtamu sallī
nĕmmadi nāgĕ muṁdara niluvam̐gam̐galavā

(||paḍam̐||)
nĕlam̐ta sanugubbala nimmabaṁḍlĕ garavesī
balimi nī sedulanu paṭṭam̐galavā
saḽubula māḍala salivaṁdi lidĕ pĕṭṭī
kalasi yaṁdugu lonugāguṁḍam̐galavā

(||paḍam̐||)
maguva movi sannala machchulu vesī navigo
tagulu vaḍaga nīvu dāyagalavā
nigiḍi śhrīveṁkaḍeśha nī vegĕ gūḍidivi
tagilī ninnu radulam̐ dappiṁchugom̐galavā