పడఁతి నింతె నన్నేల పచ్చిసేసీనే
(॥పల్లవి॥)
పడఁతి నింతె నన్నేల పచ్చిసేసీనే
తడఁబడ నీ సుద్దులు తనకే యమరునే
(॥పడఁ॥)
బగ్గన నాలిమగనిఁ బలకతో వాసి తెచ్చి
సిగ్గువడఁగానే నాచేతి కిచ్చీనే
యెగ్గులేక యిది దన కెవ్వతె నేర్పెనో కాని
అగ్గమైన దొరలకు నవి వోజలటవే
(॥పడఁ॥)
గబ్బియాడోమాఁటలు చిల్కలకెల్లాను నేరిపి
వుబ్బించి మాయింటికాడ నొప్పగించీనే
జొబ్బిల నే పొస్తకానఁ జూచుకొనెనోకాని
నిబ్బరపుజాణనికి నేమ మిదియటవే
(॥పడఁ॥)
చప్పుడు సగినాల మంచముపై నన్నుంచుకొని
కప్పి తలవంచుకోఁగాఁ గాఁగిలించే
ఇప్పుడె శ్రీవేంకటేశుఁ డెక్కడఁ దెచ్చెనోకాని
తప్పలేని ఘనుననకు తగ నిదౌనటవే
(||pallavi||)
paḍam̐ti niṁtĕ nannela pachchisesīne
taḍam̐baḍa nī suddulu tanage yamarune
(||paḍam̐||)
baggana nālimaganim̐ balagado vāsi tĕchchi
sigguvaḍam̐gāne nāsedi kichchīne
yĕggulega yidi dana kĕvvadĕ nerbĕno kāni
aggamaina dŏralagu navi vojalaḍave
(||paḍam̐||)
gabbiyāḍomām̐ṭalu silgalagĕllānu neribi
vubbiṁchi māyiṁṭigāḍa nŏppagiṁchīne
jŏbbila ne pŏstagānam̐ jūsugŏnĕnogāni
nibbarabujāṇanigi nema midiyaḍave
(||paḍam̐||)
sappuḍu sagināla maṁchamubai nannuṁchugŏni
kappi talavaṁchugom̐gām̐ gām̐giliṁche
ippuḍĕ śhrīveṁkaḍeśhum̐ ḍĕkkaḍam̐ dĕchchĕnogāni
tappaleni ghanunanagu taga nidaunaḍave