పచ్చిదేరి జవ్వనము పరువము వచ్చె నీకు
(॥పల్లవి॥)
పచ్చిదేరి జవ్వనము పరువము వచ్చె నీకు
విచ్చనవిడాయ నేఁడు వేరులు మరేఁటికే
(॥పచ్చి॥)
వలిపెపయ్యెదలోని వలుద చన్నులకాంతి
వెలికి నురికీఁ గదే వెలఁది
సెలవుల నిండుకొన్న చిరుతనవ్వులసిగ్గు
పులియఁ బెట్టకువే పొద్దుకుఁ బొద్దుకును
(॥పచ్చి॥)
రెప్పలమఱఁగునను రేఁగిన చింకచూపులు
వుప్పరా లెగసీఁగదే వువిదా
ముప్పిరిగొనీ సారె మోవిమీఁదఁబలుకుల
కుప్పలు వేయకువే కొసరులను
(॥పచ్చి॥)
మురిపెపుఁ బిరుదులు మొలనూలిగంటలతో
సురతము చాటీఁ గదే సుదతి
యిరవైన శ్రీ వేంకటేశుఁడ నే నన్నుఁ గూడి
వెరగుల వడకువే వెలసె నీపొందులు
(||pallavi||)
pachchideri javvanamu paruvamu vachchĕ nīgu
vichchanaviḍāya nem̐ḍu verulu marem̐ṭige
(||pachchi||)
valibĕbayyĕdaloni valuda sannulagāṁti
vĕligi nurigīm̐ gade vĕlam̐di
sĕlavula niṁḍugŏnna sirudanavvulasiggu
puliyam̐ bĕṭṭaguve pŏddugum̐ bŏddugunu
(||pachchi||)
rĕppalamaṟam̐gunanu rem̐gina siṁkasūbulu
vupparā lĕgasīm̐gade vuvidā
muppirigŏnī sārĕ movimīm̐dam̐balugula
kuppalu veyaguve kŏsarulanu
(||pachchi||)
muribĕbum̐ birudulu mŏlanūligaṁṭalado
suradamu sāḍīm̐ gade sudadi
yiravaina śhrī veṁkaḍeśhum̐ḍa ne nannum̐ gūḍi
vĕragula vaḍaguve vĕlasĕ nībŏṁdulu