Pachchiderem banulu pamtamu leederenu

పచ్చిదేరెఁ బనులు పంతము లీడేరెను
Language

(॥పల్లవి॥)
పచ్చిదేరెఁ బనులు పంతము లీడేరెను
ఇచ్చ యెఱుఁగుదును మా ఇంటికి రావోయి

(॥పచ్చి॥)
మొదల మేను నీమోవి చూచి నోరూరితి
కొదవెట్టి ఇఁక నిన్నుఁ గోపగించేనా
వదలెఁ బయ్యదకొంగు వలపు నీరపమాయ
హృదయాలు గలసెను ఇంటికి రావోయి

(॥పచ్చి॥)
సంగతిగా నిదివో నీ సరసానకు లోనైతి
రంగుగా నే నిఁక నిన్ను రవ్వ సే సేనా
అంగమెల్లఁ జెమరించె ఆయము నీవెఱుఁగుదు
వింగితాకారాలు గంటి నింటికి రావోయి

(॥పచ్చి॥)
కతలుగా నేఁడు నీ కాఁగిటిలోనఁ జొక్కితి
పతిగా నే నిఁక నీతో పంతమాడేనా
సతమైనకళ లుబ్బె సమమోహములు నిండె
హితవై శ్రీ వేంకటేశ ఇంటికి రావోయి

(||pallavi||)
pachchiderĕm̐ banulu paṁtamu līḍerĕnu
ichcha yĕṟum̐gudunu mā iṁṭigi rāvoyi

(||pachchi||)
mŏdala menu nīmovi sūsi norūridi
kŏdavĕṭṭi im̐ka ninnum̐ gobagiṁchenā
vadalĕm̐ bayyadagŏṁgu valabu nīrabamāya
hṛdayālu galasĕnu iṁṭigi rāvoyi

(||pachchi||)
saṁgadigā nidivo nī sarasānagu lonaidi
raṁgugā ne nim̐ka ninnu ravva se senā
aṁgamĕllam̐ jĕmariṁchĕ āyamu nīvĕṟum̐gudu
viṁgidāgārālu gaṁṭi niṁṭigi rāvoyi

(||pachchi||)
kadalugā nem̐ḍu nī kām̐giḍilonam̐ jŏkkidi
padigā ne nim̐ka nīdo paṁtamāḍenā
sadamainagaḽa lubbĕ samamohamulu niṁḍĕ
hidavai śhrī veṁkaḍeśha iṁṭigi rāvoyi