Pachchalaaya kattinattu bayalu vamdilainattu

పచ్చలాయ కట్టినట్టు బయలు వందిలైనట్టు
Language

(॥పల్లవి॥)
పచ్చలాయ కట్టినట్టు బయలు వందిలైనట్టు
గచ్చులెన్నైనాఁ గలవు కైకొనేముగాక

(॥పచ్చ॥)
మచ్చిక నీమాఁటలు దీమపుమెకమువంటివి
కుచ్చితాన మెల్లనే తగులఁదీసేవు
పచ్చివెచ్చియైయుండు పడఁతులకేల్లాను
యెచ్చరి నీవాడినట్టె యియ్యకొంటగాక

(॥పచ్చ॥)
మాయల నీ నవ్వు లివి మచ్చుమేపులవంటివి
చాయల సన్నల నాసానిలఁ బెట్టేవి
మూయక మూసినట్టుండు ముద్దరాండ్లకెల్లాను
తోయక నీకిచ్చలాడదొరకొంటగాక

(॥పచ్చ॥)
చేనకేనీకాఁగిలి జిగురుఁగండెవంటిది
అనువుగాఁ జొక్కించి అంటుకొనేది
ఘనుఁడ శ్రీవేంకటేశ కలసితి విటు నన్ను
తనిసి వేడుక లోలో దైవారుటగాక

(||pallavi||)
pachchalāya kaṭṭinaṭṭu bayalu vaṁdilainaṭṭu
gachchulĕnnainām̐ galavu kaigŏnemugāga

(||pachcha||)
machchiga nīmām̐ṭalu dīmabumĕgamuvaṁṭivi
kuchchidāna mĕllane tagulam̐dīsevu
pachchivĕchchiyaiyuṁḍu paḍam̐tulagellānu
yĕchchari nīvāḍinaṭṭĕ yiyyagŏṁṭagāga

(||pachcha||)
māyala nī navvu livi machchumebulavaṁṭivi
sāyala sannala nāsānilam̐ bĕṭṭevi
mūyaga mūsinaṭṭuṁḍu muddarāṁḍlagĕllānu
toyaga nīgichchalāḍadŏragŏṁṭagāga

(||pachcha||)
senagenīgām̐gili jigurum̐gaṁḍĕvaṁṭidi
anuvugām̐ jŏkkiṁchi aṁṭugŏnedi
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalasidi viḍu nannu
tanisi veḍuga lolo daivāruḍagāga