పాయమే పై తరవాయఁ బట్టకురా యెగ్గు నీవు
(॥పల్లవి॥)
పాయమే పై తరవాయఁ బట్టకురా యెగ్గు నీవు
యేయెడ నీకతమున నే నెన్నిక కెక్కితిరా
(॥పాయ॥)
మునుముందు చూచితేను మోవరాదు కుచములు
వెనక చూచితే వేఁకము నాతురు మిది
యెనసి నీ చేఁతలును యిట్టెపో యేమి సేతు
తనిసి నింత లోనే తమక మేఁటికిరా
(॥పాయ॥)
పట్టితేను పసలేదు పంతపునానడు మిది
వెట్టిని విడువరాదు వేఁడి నిట్టూరుపుగాలి
ఇట్టెపో నీసుద్దు లేమందు నే నిన్ను
మట్టులేదు నావలపు మాయలఁ బెట్టకురా
(॥పాయ॥)
చొక్కక నిన్నెడసితే సొమ్మలవుమ్మలఱట్టు
పక్కన నిన్నుఁ గూడితే పరవశములు బెట్టు
యెక్కువ శ్రీవేంకటేశ యిఁకనో నాచంద మిది
చక్కఁగాఁ గూడితి విట్టె జాణతనా లేలరా
(||pallavi||)
pāyame pai taravāyam̐ baṭṭagurā yĕggu nīvu
yeyĕḍa nīgadamuna ne nĕnniga kĕkkidirā
(||pāya||)
munumuṁdu sūsidenu movarādu kusamulu
vĕnaga sūside vem̐kamu nāduru midi
yĕnasi nī sem̐talunu yiṭṭĕbo yemi sedu
tanisi niṁta lone tamaga mem̐ṭigirā
(||pāya||)
paṭṭidenu pasaledu paṁtabunānaḍu midi
vĕṭṭini viḍuvarādu vem̐ḍi niṭṭūrubugāli
iṭṭĕbo nīsuddu lemaṁdu ne ninnu
maṭṭuledu nāvalabu māyalam̐ bĕṭṭagurā
(||pāya||)
sŏkkaga ninnĕḍaside sŏmmalavummalaṟaṭṭu
pakkana ninnum̐ gūḍide paravaśhamulu bĕṭṭu
yĕkkuva śhrīveṁkaḍeśha yim̐kano nāsaṁda midi
sakkam̐gām̐ gūḍidi viṭṭĕ jāṇadanā lelarā