(॥పల్లవి॥)
పాయక నన్నేలుమని పడఁతులాల
నాయకుని తోడుత విన్నపములు సేయరే
(॥పాయ॥)
చింతలు వెల్లివిరిసెఁ జెక్కు పైకిఁ జేయి వచ్చె
ఇంతసేసె నా మన సేమి సేతునే
మంతనాన నుండరాదు మరేమిటాఁ బొద్దువోదు
పంతగాఁ డితనితోఁ దప్పక చెప్పరే
(॥పాయ॥)
పొదలె నిట్టూరుపులు పొందె నడియాసలు
యెదురెక్కె నా వలపు యేమిసేతునే
పదరితేఁ జవి గాదు పాసివుండఁ బనిలేదు
వుదుటువాఁ డితనికి నొడఁబడఁ జెప్పరే
(॥పాయ॥)
తనువెల్లాఁ బులకించె తతిగొనెఁ జెమటలు
యినుమడించెఁ దమక మేమి సేతునే
చెనకి యింకేలవాదు శ్రీ వేంకటేశుఁడు సాదు
కొనబువాఁ డితఁ డిట్టె కూడుమని చెప్పరే
(||pallavi||)
pāyaga nannelumani paḍam̐tulāla
nāyaguni toḍuda vinnabamulu seyare
(||pāya||)
siṁtalu vĕllivirisĕm̐ jĕkku paigim̐ jeyi vachchĕ
iṁtasesĕ nā mana semi sedune
maṁtanāna nuṁḍarādu maremiḍām̐ bŏdduvodu
paṁtagām̐ ḍidanidom̐ dappaga sĕppare
(||pāya||)
pŏdalĕ niṭṭūrubulu pŏṁdĕ naḍiyāsalu
yĕdurĕkkĕ nā valabu yemisedune
padaridem̐ javi gādu pāsivuṁḍam̐ baniledu
vuduḍuvām̐ ḍidanigi nŏḍam̐baḍam̐ jĕppare
(||pāya||)
tanuvĕllām̐ bulagiṁchĕ tadigŏnĕm̐ jĕmaḍalu
yinumaḍiṁchĕm̐ damaga memi sedune
sĕnagi yiṁkelavādu śhrī veṁkaḍeśhum̐ḍu sādu
kŏnabuvām̐ ḍidam̐ ḍiṭṭĕ kūḍumani sĕppare