Paayabuvaam dadamdoo padusumdanamu needi

పాయపువాఁ డతఁడూ పడుచుఁదనము నీది
Language

(॥పల్లవి॥)
పాయపువాఁ డతఁడూ పడుచుఁదనము నీది
చేయరాని వినయాలఁ జెలఁగఁగాను

(॥పాయ॥)
సిగ్గులు వడుదురటే చెలువుఁడు మాటాడితే
వొగ్గి తాఁ జేతికిలోనై వున్నాఁడు నీకు
వెగ్గళింతురటవే వెస నిట్టె మోహించి
తగ్గులేనిరతులకు దమకించఁగాను

(॥పాయ॥)
శిరసువంతురటే చెనకి యీతఁడంటితే
సొరిది నిట్టె యెదురుచూచీ నీకు
గరిసింతురటవే కాఁకల నాతఁడు వొంది
పొరిఁబొరి నీ గుణాలు పొగడఁగాను

(॥పాయ॥)
చిన్నబోఇవుందురటే చేరి యీతఁడు గూడఁగా
కన్నులఁ జూచినంతనే కరఁగీ నీకు
ఇన్నిటా శ్రీవేంకటేశుఁ డేలినాఁడు నిన్నింతలో
పన్ని పెనఁగుదురటె బాఁతిపడఁగాను

(||pallavi||)
pāyabuvām̐ ḍadam̐ḍū paḍusum̐danamu nīdi
seyarāni vinayālam̐ jĕlam̐gam̐gānu

(||pāya||)
siggulu vaḍuduraḍe sĕluvum̐ḍu māḍāḍide
vŏggi tām̐ jedigilonai vunnām̐ḍu nīgu
vĕggaḽiṁturaḍave vĕsa niṭṭĕ mohiṁchi
tagguleniradulagu damagiṁcham̐gānu

(||pāya||)
śhirasuvaṁturaḍe sĕnagi yīdam̐ḍaṁṭide
sŏridi niṭṭĕ yĕdurusūsī nīgu
garisiṁturaḍave kām̐kala nādam̐ḍu vŏṁdi
pŏrim̐bŏri nī guṇālu pŏgaḍam̐gānu

(||pāya||)
sinnaboivuṁduraḍe seri yīdam̐ḍu gūḍam̐gā
kannulam̐ jūsinaṁtane karam̐gī nīgu
inniḍā śhrīveṁkaḍeśhum̐ ḍelinām̐ḍu ninniṁtalo
panni pĕnam̐guduraḍĕ bām̐tibaḍam̐gānu