Paayabu ramanumda neebamta mimka netlano

పాయపు రమణుఁడ నీపంత మింక నెట్లనో
Language

(॥పల్లవి॥)
పాయపు రమణుఁడ నీపంత మింక నెట్లనో
ఆయములే విపరీత మాయఁబో నేఁడు

(॥పాయ॥)
వుపమించిఁ జందురుఁడు వుదయమైతే భూమి
తపిఇంచి చీఁకట్లు తలఁగుఁగాని
కపురునాతురుము చీఁకటి నీమోము శశి
వుపరిసురతమున నోడించె నేఁడు

(॥పాయ॥)
ఆలరికొండలమీఁద నంబరపు మేఘములు
గాలికి వాలి నిండాఁ గప్పుఁగాని
నీలమేఘము వంటినీపై నాకుచగురు
లోలి నుపరతియందు నొగి వాలె నేఁడు

(॥పాయ॥)
తేరిమీఁద మదనుఁడు తెలివొందుఁగాని యందు
నేరుపు శ్రీవేంకటేశ నీనాయందు
బీరపుమరునిమీఁద పిరిఁదితేరు వారె
ఆరితేరి రతి వింతలాయఁబో నేఁడు

(||pallavi||)
pāyabu ramaṇum̐ḍa nībaṁta miṁka nĕṭlano
āyamule vibarīda māyam̐bo nem̐ḍu

(||pāya||)
vubamiṁchim̐ jaṁdurum̐ḍu vudayamaide bhūmi
tabiiṁchi sīm̐kaṭlu talam̐gum̐gāni
kaburunādurumu sīm̐kaḍi nīmomu śhaśhi
vubarisuradamuna noḍiṁchĕ nem̐ḍu

(||pāya||)
ālarigŏṁḍalamīm̐da naṁbarabu meghamulu
gāligi vāli niṁḍām̐ gappum̐gāni
nīlameghamu vaṁṭinībai nāgusaguru
loli nubaradiyaṁdu nŏgi vālĕ nem̐ḍu

(||pāya||)
terimīm̐da madanum̐ḍu tĕlivŏṁdum̐gāni yaṁdu
nerubu śhrīveṁkaḍeśha nīnāyaṁdu
bīrabumarunimīm̐da pirim̐dideru vārĕ
ārideri radi viṁtalāyam̐bo nem̐ḍu