పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడ
పల్లవి:
పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడు లోకం
కాళరాత్రికి చందమామకి ముళ్లుపెట్టె మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా... ఓ... ఓ...
చరణం 1:
తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి సాకింది నా కన్నతల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైనా అపకారి కాను
చేసిన పాపములా ... ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ... ఇది దేవుని శాసనమా ..ఇది తీరేదే కాదా ॥
చరణం 2:
తాళంటే తాడనే తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్లికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం ..నా మీద నాకేలే కోపం
నా తొలి నేరములా .. ఇవి తీరని వేదనలా
నా మది లోపములా .. ఇవి ఆరని శోకములా ..ఇక ఈ బాధే పోదా ॥
pallavi:
pāvurānigi paṁjarānigi pĕḽlisesĕ pāḍu logaṁ
kāḽarātrigi saṁdamāmagi muḽlubĕṭṭĕ mūḍhalogaṁ
kŏḍigaṭṭina dībāle guḍi hāradulayyenā... o... o...
saraṇaṁ 1:
tānichchu pālalo premaṁtā kalibi sāgiṁdi nā kannadalli
lāliṁchu pāḍalo nīdaṁtā tĕlibi pĕṁchiṁdi nālona maṁchi
kabaḍālu mosālu nālona levu kalanainā abagāri kānu
sesina pābamulā ... ivi ā vidhi śhābamulā
mārani jādagamā ... idi devuni śhāsanamā ..idi tīrede kādā ||
saraṇaṁ 2:
tāḽaṁṭe tāḍane talasānu nāḍu adi edo tĕlisenu neḍu
ā tāḽi pĕḽlige ṛjuvanna nijamu taruvāda tĕlisemi phalamu
emainā edainā jarigiṁdi ghoraṁ ..nā mīda nāgele kobaṁ
nā tŏli neramulā .. ivi tīrani vedanalā
nā madi lobamulā .. ivi ārani śhogamulā ..iga ī bādhe podā ||