పాఱి పాఱి జగడాలు పనిలేదయ్యా
(॥పల్లవి॥)
పాఱి పాఱి జగడాలు పనిలేదయ్యా
మీఱితే మీఁదటి మాఁట మీకుఁ జెప్పేనయ్యా
(॥పాఱి॥)
యిట్టె కోపగాంతుగాని యింటికి రాకుండలేవు
వొట్టులు సత్యాలు నీకు నొమ్మవయ్యా
వట్టిసటలే కాక వావిచడ మందుగద్దా
బెట్టి నిన్నుఁ బిలువఁగఁ బెనఁగకువయ్యా
(॥పాఱి॥)
వెంగేనఁ దిట్టుదుగాని వేఁడుకొనకుండ లేవు
చెంగటి బొమ్మలజంకె చెల్లదయ్యా
అంగవించితే నీళ్లడచితే రెండౌన
కొంగువట్టి తియ్యఁగాను గుట్టు నీకేలయ్యా
(॥పాఱి॥)
గరిమె మెఱతుగాని కాఁగిలించకుండలేవు
పొరపాచ్చా లిఁక నీకుఁ బొసఁగదయ్యా
ఇరవై శ్రీవేంకేశ యేలితివి నన్ను నిట్టె
తెరమఱఁ గిఁకనేల తెలిసితివయ్యా
(||pallavi||)
pāṟi pāṟi jagaḍālu paniledayyā
mīṟide mīm̐daḍi mām̐ṭa mīgum̐ jĕppenayyā
(||pāṟi||)
yiṭṭĕ kobagāṁtugāni yiṁṭigi rāguṁḍalevu
vŏṭṭulu satyālu nīgu nŏmmavayyā
vaṭṭisaḍale kāga vāvisaḍa maṁdugaddā
bĕṭṭi ninnum̐ biluvam̐gam̐ bĕnam̐gaguvayyā
(||pāṟi||)
vĕṁgenam̐ diṭṭudugāni vem̐ḍugŏnaguṁḍa levu
sĕṁgaḍi bŏmmalajaṁkĕ sĕlladayyā
aṁgaviṁchide nīḽlaḍaside rĕṁḍauna
kŏṁguvaṭṭi tiyyam̐gānu guṭṭu nīgelayyā
(||pāṟi||)
garimĕ mĕṟadugāni kām̐giliṁchaguṁḍalevu
pŏrabāchchā lim̐ka nīgum̐ bŏsam̐gadayyā
iravai śhrīveṁkeśha yelidivi nannu niṭṭĕ
tĕramaṟam̐ gim̐kanela tĕlisidivayyā